సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kanishka Soni: టాప్ లేపి నడుమును చూపించమన్నాడంటూ.. సాజిద్‌ఖాన్‌పై షాకింగ్ ఆరోపణలు చేసిన నటి..

ABN, First Publish Date - 2022-10-14T02:39:28+05:30

హిందీలోని పాపులర్ రియాలిటీ షోస్‌లో బిగ్‌బాస్ (Bigg Boss) ఒకటి. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షో సంచలన విజయం సాధించింది. కానీ, ఈ సీజన్ ఈ మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందీలోని పాపులర్ రియాలిటీ షోస్‌లో బిగ్‌బాస్ (Bigg Boss) ఒకటి. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షో సంచలన విజయం సాధించింది. కానీ, ఈ సీజన్ ఈ మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సాజిద్ ఖాన్ (Sajid Khan) షొలోకి ఎంటర్ అయినప్పటి నుంచి వివాదాస్పదం అయింది. తమను లైంగికంగా వేధించాడని షెర్లీన్ చోప్రా (Sherlyn Chopra), జియా ఖాన్‌తో సహా అనేక మంది సెలబ్రిటీలు సాజిద్‌పై ఆరోపణలు గుప్పించారు. తాజాగా ఓ టీవీ నటి కూడా అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.   


‘పవిత్ర రిష్తా’ (Pavitra Rishta), ‘దియా ఔర్ బాతీ హమ్’ (Diya Aur Baati Hum) వంటి హిందీ సీరియల్స్‌లో నటించి ఫేమ్ సంపాదించుకున్న టీవీ నటి కనిష్కా సోనీ (Kanishka Soni). సాజిద్ తనను లైంగికంగా వేధించాడని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. టాప్ లేపి నడుముని చూపించామన్నాడని ఆరోపించింది. ‘‘నేను గత నెలలో అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాను. అందులో భాగంగా ఓ వ్యక్తిపై  లైంగిక వేధింపుల ఆరోపణలు చేశాను. అతడి పేరును అప్పుడు బయటపెట్టాలంటే చాలా భయమేసింది. అతడు ఓ సారి తన ఇంటికి నన్ను పిలిచాడు. సినిమాలో అవకాశం కావాలంటే టాప్ లేపి నడుముని చూపించమన్నాడు. ప్రస్తుతం అతడు బిగ్‌బాస్‌లో ఉన్నాడు. సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది సన్నిహితులు ఈ విషయం గురించి ప్రపంచానికి వెల్లడించామన్నారు. అందువల్ల అసలు ఏం జరిగిందో చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికి పూర్తి నిజాన్ని చెబుతుంటే నాకు అభద్రతగా అనిపిస్తుంది. ఎందుకంటే వారు బలమైన వ్యక్తులు. ఏ సమయంలోనైనా నన్ను చంపేస్తారు. భారత ప్రభుత్వంలోని చట్టాల మీద నాకు నమ్మకం లేదు. కానీ, నేను దేవుణ్ని నమ్ముతాను. నమ్మకం ఉంది. దేవత నాలో ఉందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరిని శిక్షించడానికి సిద్ధంగా ఉందని భావిస్తున్నాను. బిగ్‌బాస్‌లో పాల్గొనడానికి మీరందరు ఆమోదం తెలిపిన సాజిద్ గురించే నేను మాట్లాడుతున్నాను. నా, ప్రతి ఒక్కరి ఫేవరేట్ అయిన సల్మాన్ ఖాన్‌ను నేను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. బిగ్‌బాస్ షోకి ఓ వ్యక్తిని మీరు ఏ విధంగా ఎంపిక చేస్తారు. ఈ పూర్తి వీడియోను అందరు తప్పక చూడండి. నా మనస్సుతో ఈ విషయాలను పూర్తిగా ప్రపంచానికి తెలుపుతున్నాను. నా కెరీర్‌ను కొత్తగా హాలీవుడ్‌లో ప్రారంభిస్తున్నాను. నేను ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం లేదు’’ అని కనిష్కా సోనీ పేర్కొంది.       




Updated Date - 2022-10-14T02:39:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!