ప్రభాస్ ‘Project K’ లో మరో బాలీవుడ్ బ్యూటీ

ABN , First Publish Date - 2022-05-08T20:47:19+05:30 IST

‘బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas).

ప్రభాస్ ‘Project K’ లో మరో బాలీవుడ్ బ్యూటీ

‘బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం ‘ప్రాజెక్ట్-కె’ (Project K) సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. అమితాబ్ బచ్చన్ (amitabh bachchan), దీపికా పదుకొణె (Deepika Padukone) కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీకీ అవకాశం దక్కింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆమెకు స్వాగతం చెబుతూ గిఫ్ట్‌ను పంపించింది. 


‘ప్రాజెక్ట్-కె’ చిత్రంలో బాలీవుడ్ భామ దిశా పటానీ (Disha Patani) ఓ కీలక పాత్రలో నటించనుంది. ఈ సందర్భంగా నిర్మాణసంస్థ వైజయంతి మూవీస్ (vyjayanthi movies) ఆమెకు స్వాగతం చెబుతూ బోకేను పంపించింది. ఈ గిఫ్ట్‌కు ఓ నోట్‌ను కూడా జత చేసింది. ‘‘.. ‘ప్రాజెక్ట్-కె’ చిత్ర బృందం మీకు స్వాగతం చెబుతుంది. ఈ సినిమాలో మీరు నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని ఆ నోట్‌లో ఉంది. ఈ విషయాన్ని తెలుపుతూ దిశా తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘ప్రాజెక్ట్-కె’ సినిమాను విజువల్ వండర్‌గా రూ. 400కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. దిశా పటానీ తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. పూరీ జగన్నాథ్ (puri jagannadh) దర్శకత్వం వహించిన ‘లోఫర్’ (loafer) చిత్రంతో ఆమె కెరీర్‌ను ఆరంభించింది.Updated Date - 2022-05-08T20:47:19+05:30 IST

Read more