Kaali poster row: ఫిల్మ్‌మేకర్ Leena Manimekalai పై సెటైర్లు వేసిన Vivek Agnihotri

ABN , First Publish Date - 2022-07-12T16:21:02+05:30 IST

ఎన్‌ఆర్‌ఐ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై (Leena Manimekalai) విడుదల చేసిన ‘కాళీ (Kaali)’ పోస్టర్‌ను వివాదం గురించి తెలిసిందే...

Kaali poster row: ఫిల్మ్‌మేకర్ Leena Manimekalai పై సెటైర్లు వేసిన Vivek Agnihotri

ఎన్‌ఆర్‌ఐ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై (Leena Manimekalai) విడుదల చేసిన ‘కాళీ (Kaali)’ పోస్టర్‌ను వివాదం గురించి తెలిసిందే. ఈ పోస్టర్‌లో హిందువులు ఎంతో భక్తిగా పూజించే కాళీ మాత అవతారంలో ఉన్న పర్సన్ స్మోక్ చేస్తుంటారు. దీంతో పలువురి మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆమెపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. హిందువుల మనో‌భావాలను కించపరిచారంటూ లీనాపై అనేక మంది ఫిర్యాదు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఆమెపై కేసును నమోదు చేశారు. ట్విట్టర్ కూడా ఆమె ట్వీట్‌ను డిలీట్ చేసింది.


లీనా మణి మేకలై విడుదల చేసిన పోస్టర్‌లో కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్టు ఉండడమే కాకుండా.. వెనుక భాగంలో ఎల్‌జీబీ‌టీక్యూ (LGBTWQ) కమ్యూనిటీకి చెందిన జెండా కూడా ఉంది. దీంతో వారి కోపం ఇంకా ఎక్కువైంది. దీనిపై లీనా స్పందిస్తూ.. ‘నా కాళీ క్వీర్. స్వేచ్ఛగా ఉంటుంది. పితృస్వామ్యాన్ని విచ్చిన్నం చేస్తుంది. హిందూత్వన్ని కూల్చేస్తుంది. పెట్టుబడిదారి విధానాన్ని నాశనం చేస్తుంది. వేయి చేతులతో ప్రతి ఒక్కరిని కౌగిలించుకుంటుంది’ అని లీనా మణి మేఖలై ట్వీట్ చేసింది. ఇక్కడ క్వీర్’ అంటే తమని తాము మగ అనిగానీ, మహిళ అనిగానీ అంగీకరించని వారు. అయితే, వీళ్లు  లెస్బియనో, హోమో సెక్సువల్ మగవారో కూడా కాదు. తమ జెండర్ విషయంలో ‘అయితే ఇటు-లేదా అటు’ అన్నట్టుగా తేల్చిచెప్పని వారు మాత్రమే. 


విమర్శల సమాధానంగా లీనా చేసిన కామెంట్స్‌పై ‘కాశ్మీర్ ఫైల్స్’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తాజాగా సోషల్ మీడియాలో స్పందించాడు. లీనా ట్వీట్‌ని షేర్ చేసిన వివేక్.. ‘దయచేసి. అలాంటి నీతులు చెప్పే వెర్రివాళ్లని ఎవరైనా నాశనం చేయగలరా?’ అని వెటకారంగా రాసుకొచ్చాడు. అలాగే.. ఈ పోస్ట్‌కి నాలుక బయటపెట్టి వెక్కిరిస్తున్న పది ఎమోజీలను కూడా జోడించాడు.



Updated Date - 2022-07-12T16:21:02+05:30 IST