Ranbir Kapoor కొత్త సినిమా Shamshera పోస్టర్ లీక్.. సంతోషంగా ఉందంటున్న దర్శకుడు..

ABN , First Publish Date - 2022-06-19T19:40:55+05:30 IST

బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంషేరా’. కరణ్‌ మల్హోత్రా (Karan Malhotra) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ...

Ranbir Kapoor కొత్త సినిమా Shamshera పోస్టర్ లీక్.. సంతోషంగా ఉందంటున్న దర్శకుడు..

బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంషేరా’. కరణ్‌ మల్హోత్రా (Karan Malhotra) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పోస్టర్ త్వరలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లానింగ్ చేస్తోంది. ఈ తరుణంలోనే ఈ పోస్టర్ నెట్టింట లీకై హల్‌చల్ చేస్తోంది. దీంతో మూవీ టీం షాక్‌కి గురైంది. ఈ ఘటనపై ఆ మూవీ డైరెక్టర్‌ కరణ్ మల్హోత్రా ఓ ఇంటర్వ్యూలో తాజాగా స్పందిస్తూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.


కరణ్ మాట్లాడుతూ.. ‘మనం ఓ సమయంలో కొన్ని పనులు చేసేలా ప్లాన్ చేసుకుంటాం. కానీ మన విషయంలో విశ్వానికి వేరే ప్లాన్స్ ఉంటాయని మర్చిపోతాం. అది మనకు సపోర్టు చేస్తూ పనులు సరైన టైమ్‌లో జరిగేలా చేస్తుంది. ఈ సంఘటనే దానికి సరైన ఉదాహరణ. రణ్‌బీర్ కపూర్ అభిమానులకు మా చిత్ర పోస్టర్, ఆయన లుక్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.


కరణ్ ఇంకా మాట్లాడుతూ.. ‘మేము వచ్చే వారం నుంచి మా ప్రచారాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. కానీ అభిమానులు అప్పటి వరకూ వేచి ఉండేలా లేరు. నేను వారిని నిందించను.. ఎందుకంటే వారే ఈ సినిమా తయారవ్వడానికి కారణం. ఈ సినిమా కోసం చాలా కాలంగా వేచి ఉన్నారు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత రణబీర్ మళ్లీ వెండితెరపైకి వస్తున్నాడు. కాబట్టి అభిమానులు తమ ఉత్సాహాన్ని అదుపు చేసుకోవడం చాలా కష్టం. పోస్టర్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని తెలిపాడు.


జులై 22న సినిమాని విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. బానిసలాగా ఉన్న వ్యక్తి నాయకుడిగా ఎదిగి, తన తెగను ఎలా ముందుకు నడిపించాడనేది ఈ చిత్ర కథాంశం. కరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. హిందీతోపాటు తమిళం, తెలుగులోనూ విడుదల చేయనున్నారు. కాగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన మరో చిత్రం ‘బ్రహ్మాస్త్ర (Brahmastra)’. అలియాభట్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 9న హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది. అలాగే.. లవ్ రంజన్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో శ్రద్ధా కపూర్ ఆయనకి జోడిగా నటిస్తోంది.

Updated Date - 2022-06-19T19:40:55+05:30 IST

Read more