సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Brahmastra: బాలీవుడ్ సినిమాల్లోనే అత్యధిక వ్యయంతో నిర్మితం.. బడ్జెట్ ఎంతంటే..?

ABN, First Publish Date - 2022-09-02T00:04:08+05:30

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. ఫాక్స్‌‌స్టార్ స్టూడియోస్‌తో కలసి ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించాడు. పాన్ ఇండియాగా ఈ మూవీ రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడటంతో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బాలీవుడ్ వర్గాల్లో హల్‌చల్ చేస్తుంది. 


‘బ్రహ్మాస్త్ర’ బడ్జెట్ రూ. 410కోట్లని టాక్. ప్రచార కార్యక్రమాలకు వెచ్చించిన ఖర్చును మినహాయిస్తేనే బడ్జెట్ అంత అయిందని సమాచారం. ఇప్పటి వరకు వచ్చిన బాలీవుడ్ చిత్రాల్లో అత్యధిక వ్యయంతో నిర్మితమైనది ‘బ్రహ్మాస్త్ర’ నే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ట్రైలర్‌లో కొన్ని విజువల్స్‌ను మాత్రమే చూపించారని.. మూవీని పూర్తి గ్రాండియర్‌గా నిర్మించారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ‘బ్రహ్మాస్త్ర’ ను మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్‌లో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పురాణాల్లోని అస్త్రాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. దక్షిణాది భాషల్లో దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి ఈ మూవీని సమర్పిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, మౌనిరాయ్, అక్కినేని నాగార్జున తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2022-09-02T00:04:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!