Brahmastra: మొదట అనుకున్న టైటిల్ ఏంటంటే..!

ABN , First Publish Date - 2022-09-05T00:56:21+05:30 IST

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan

Brahmastra: మొదట అనుకున్న టైటిల్ ఏంటంటే..!

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. ఫాక్స్‌‌స్టార్ స్టూడియోస్‌తో కలసి ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అయాన్ దాదాపు ఎనిమిదేళ్లు కష్టపడ్డాడు. ఈ మూవీ చేద్దామనుకున్నప్పుడు అయాన్ మొదట్లో వేరే టైటిల్ అనుకున్నాడు. 


‘బ్రహ్మాస్త్ర’ కు మొదట అనుకున్న టైటిల్ ‘డ్రాగన్’ (Dragon). కానీ, కథకు ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావించారు. దీంతో టైటిల్‌ను ‘డ్రాగన్’ నుంచి ‘బ్రహ్మాస్త్ర’ గా మార్చారు. రణ్‌బీర్ కపూర్ పాత్రను కూడా మొదట రూమీ అని సంబోధించారు. అనంతరం హీరో పాత్రకు శివ అని పేరు పెట్టారు. టైటిల్ మార్పు గురించి గతంలో అయాన్ మీడియాతో మాట్లాడాడు. ‘‘ఈ సినిమా ప్రారంభించినప్పుడు అనుకున్న టైటిల్ డ్రాగన్. చిత్రంలోని శివ పాత్రకు అద్భుతమైన శక్తులుంటాయి. అందువల్ల స్క్రిఫ్ట్ మీద టైటిల్‌గా డ్రాగన్ అని పెట్టాం. కానీ, భారతీయ చరిత్ర, ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని మూవీ తెరకెక్కింది. అందువల్ల టైటిల్‌ను ‘డ్రాగన్’ నుంచి  ‘బ్రహ్మాస్త్ర’ కు మార్చాం’’ అని అయాన్ ముఖర్జీ చెప్పాడు. ‘బ్రహ్మాస్త్ర’ పాన్ ఇండియాగా రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా బడ్జెట్ రూ. 410కోట్లని టాక్. ప్రచార కార్యక్రమాలకు వెచ్చించిన ఖర్చును మినహాయిస్తేనే బడ్జెట్ అంత అయిందని సమాచారం. ఇప్పటి వరకు వచ్చిన బాలీవుడ్ చిత్రాల్లోనే అత్యధిక వ్యయంతో నిర్మితమైనది ‘బ్రహ్మాస్త్ర’ నే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, మౌనిరాయ్, అక్కినేని నాగార్జున తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Updated Date - 2022-09-05T00:56:21+05:30 IST