ఆ బాలీవుడ్ హీరోయిన్‌కు 16 ఏళ్లకే పెళ్లా..? ఈ ఆరుగురు సెలబ్రెటీలకు ఏ వయసులో పెళ్లయిందంటే..
ABN , First Publish Date - 2022-04-12T23:21:11+05:30 IST
అలియా భట్, రణ్‌బీర్ కపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీ టౌన్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే...

అలియా భట్, రణ్‌బీర్ కపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీ టౌన్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 17న ఈ జంట వివాహ బంధంతో ఒకటి కాబోతున్నట్లు నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వారిలో రణ్‌బీర్ వయస్సు 39 కాగా.. అలియా వయస్సు 29 మాత్రమే. అయితే గత కొన్నేళ్లుగా బాలీవుడ్ నటీమణుల్లో ఎవరూ కూడా 30 ఏళ్లకి ముందు పెళ్లీ పీటలు ఎక్కలేదు. ఈ తరుణంలో అలియా 29 ఏళ్లకే మ్యారేజ్ చేసుకోబోతుడడం విశేషం. ఈ తరుణంలో గతంలో చాలా చిన్న వయస్సులో పెళ్లి చేసుకున్న తారల వివరాలు ఇలా ఉన్నాయి..
1. డింపుల్ కపాడియా
ఈ జాబితాలో ముందు చెప్పుకోవాల్సింది నటి డింపుల్ కపాడియా గురించి. ఎందుకంటే ఆమె 16 ఏళ్ల వయస్సులోనే రాజేశ్ ఖన్నాను పెళ్లి చేసుకున్నారు. రాజేశ్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కొత్తల్లోనే డింపుల్ ఆయన్ని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే ఆయన వయస్సు 32 ఏళ్లు కావడం గమనార్హం. అంటే వారిద్దరి వయస్సుల వ్యత్యాసం 16 ఏళ్లు అన్నమాట.
2. నీతూ కపూర్
రణ్‌బీర్ కపూర్ తల్లిదండ్రులైన నీతూ కపూర్, రిషి కపూర్ 1980లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటికీ నీతూ కపూర్ వయస్సు కేవలం 21 మాత్రమే. పెళ్లి సమయానికి నీతూ కెరీర్ పిక్స్‌లో ఉంది. అయితే పెళ్లి తర్వాత ఆమె సినిమాలని పక్కన పెట్టేసి ఇంటికే పరిమితం అయిపోయారు.
3 . భాగ్యశ్రీ
‘మైనే ప్యార్ కియా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి భాగ్యశ్రీ. ఈ నటి కూడా కూడా 21 ఏళ్ల వయసులోనే ప్రియుడు హిమాలయను పెళ్లాడారు. వాళ్లిద్దరూ కలిసి ఒకే పాఠశాలలో చదువుకున్నారు. అప్పటినుంచే వారు ప్రేమించుకున్నారు. అయితే.. ఇది భాగ్యశ్రీ తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
4. దివ్య భారతి
ఈ జాబితాలో ప్రముఖ నటి దివ్య భారతి పేరు కూడా ఉంది. 1992లో ఈ తార ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు సాజిద్ నడియడ్వాలాను వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆమె వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే. అయితే.. పెళ్లయిన కొన్ని నెలలకే ఈ నటి ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు.
5. సైరా బాను
1970లలో బాగా పాపులరైన జంట దిలీప్ కుమార్, సైరా బాను 11 అక్టోబర్ 1966న వివాహం చేసుకున్నారు. అప్పటికీ సైరా వయస్సు 22 కాగా.. దిలీప్ వయస్సు 44 సంవత్సరాలు. అయితే.. 12 ఏళ్ల వయసులోనుంచే దిలీప్‌కు సైరా అభిమాని అంట. కాగా.. దిలీప్ కుమార్ 98 ఏళ్ల వయస్సులో గతేడాది మరణించారు.
6. బబిత
ఈ జాబితాలో ప్రముఖ నటి బబిత పేరు కూడా ఉంది. బబిత 23 సంవత్సరాల వయస్సులో రణధీర్ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ చిన్నప్పటి నుంచే స్నేహితులు కావడం విశేషం. పెళ్లి తర్వాత బబిత సినిమాలకి దూరంగా ఉండాలనే కండిషన్ మీద రణధీర్ తండ్రి రాజ్ కపూర్ వారి మ్యారేజ్‌కి ఒప్పుకున్నారు. దీంతో బబిత షరతును అంగీకరించి 1971లో వివాహం చేసుకొని సినిమాలకు దూరమైయ్యారు.