సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Deepika Padukone: స్వల్ప ఆస్వస్థతతో ఆస్పత్రికి..

ABN, First Publish Date - 2022-09-28T01:28:15+05:30

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకోన్‌ స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. సోమవారం రాత్రి కాస్త అన్‌ఈజీగా ఉండడంతో ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రికి వెళ్లి పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకోన్‌ (Deepika Padukone)స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. సోమవారం రాత్రి కాస్త అన్‌ఈజీగా ఉండడంతో ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రికి(hospitalised) వెళ్లి పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్వల్ప అస్వస్థతకు గురి కావడం వల్లే ఆమె వెంటనే ఆస్పత్రిలో చేరినట్లు, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు బాలీవుడ్‌ మీడియా చెబుతోంది. 


జూన్‌ నెలలో కూడా దీపికా ఆస్పత్రిలో చేరినట్లు వార్తలొచ్చాయి. ‘ప్రాజెక్ట్‌ కె’ షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్నప్పుడు ఆమె గుండె వేగంగా కొట్టుకోవడంతో కామినేని ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారని వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ఆ వార్తల్ని ఖండించింది. ప్రభాస్‌ సరసన ‘ప్రాజెక్ట్‌ కె’(Project K)తో పాటు షారుక్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ చిత్రంలో నటిస్తోంది దీపిక. హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’లోనూ ఆమె భాగమైంది. 


Updated Date - 2022-09-28T01:28:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!