సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆ విషయంలో... అప్పట్లో... Katrina, Deepika ఇద్దరి పరిస్థితీ ఒకటేనట!

ABN, First Publish Date - 2022-02-21T03:38:24+05:30

సినీ పరిశ్రమ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. మార్పు ఒక్కటే గ్లామర్ ప్రపంచంలో శాశ్వతం. అయితే, తెర మీద కనిపించే కథల్లో, కథనాల్లో అనేక మార్పులు రావటం మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఇండస్ట్రీ లోపల చోటు చేసుకునే ఛేంజెస్ మనకు పెద్దగా తెలియవు. అటువంటి ఓ పెద్ద మార్పు జరుగుతోన్న సంధి కాలంలో ‘‘నేను, కత్రీనా ఇద్దరం పరిశ్రమలోకి వచ్చాం’’ అంటోంది దీపికా పదుకొణే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ పరిశ్రమ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. మార్పు ఒక్కటే గ్లామర్ ప్రపంచంలో శాశ్వతం. అయితే, తెర మీద కనిపించే కథల్లో, కథనాల్లో అనేక మార్పులు రావటం మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఇండస్ట్రీ లోపల చోటు చేసుకునే ఛేంజెస్ మనకు పెద్దగా తెలియవు. అటువంటి ఓ పెద్ద మార్పు జరుగుతోన్న సంధి కాలంలో ‘‘నేను, కత్రీనా ఇద్దరం పరిశ్రమలోకి వచ్చాం’’ అంటోంది దీపికా పదుకొణే. 


గత కొన్ని సంవత్సరాల్లో సినిమా ప్రపంచం పెను మార్పులకు గురైందని చెబుతోంది డీపీ. ముఖ్యంగా, పీఆర్ ఏజెంట్లు, మ్యానేజర్లు ఇంతకు ముందు అందరికీ ఉండేవారు కాదట. పెద్ద పెద్ద స్టార్స్ కూడా తమ నిర్ణయాలు తామే స్వయంగా తీసుకునే వారు. ఇప్పుడు సీన్ మొత్తం ఛేంజ్ అయిపోయింది. కొత్తగా వస్తోన్న హీరోలు, హీరోయిన్స్ పూర్తిగా పీఆర్ ఏజెంట్స్, మ్యానేజర్స్ చెప్పినట్టే నడుచుకుంటున్నారు. చివరకు, మీడియా కెమెరాల ముందుకొస్తే ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి వంటి విషయాలు కూడా వారే చెప్పేస్తున్నారట. అందుకే, కొత్తగా గ్లామర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతోన్న బాయ్స్ అండ్ గాళ్స్‌కి పెద్దగా తప్పులు చేసే రిస్క్ ఇప్పుడు ఉండటం లేదని దీపికా అభిప్రాయపడింది.


2003లో కత్రీనా ‘బూమ్’ సినిమాతో భారతీయ సినిమా తెరపై ప్రత్యక్షమైంది. 2007లో దీపికా ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో హిందీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే, అటుఇటుగా ఒకేసారి కెరీర్స్ ప్రారంభించిన క్యాట్ అండ్ డీపీకి అప్పట్లో పీఆర్ ఏజెంట్స్, మ్యానేజర్స్ వంటి వారు ఉండేవారు కాదట. ఏ సినిమాలు చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి... ఇవన్నిటి విషయంలో వారు స్వంతంగానే నిర్ణయాలు తీసుకొవాల్సి వచ్చేదట. అలా ఆ విషయంలో ‘‘నేను, కత్రీనా ఒకే స్థితిని ఎదుర్కొన్నాం’’ అంటోంది దీపిక. కాకపోతే, తాము స్టార్స్‌గా ఎదుగుతోన్న సమయంలోనే పీఆర్ ఏజెంట్స్, మ్యానేజర్స్ సంస్కృతి బాగా పెరిగిందని కూడా ఆమె చెప్పింది. దానికి కూడా కత్రీనా, తాను తొందరగానే అలవాటుపడ్డామని దీపూ చెప్పుకొచ్చింది.       

Updated Date - 2022-02-21T03:38:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!