సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

JugJugg Jeeyo: చిక్కుల్లో Kiara Advani, Varun Dhawan సినిమా.. కాపీ కొట్టారంటూ..

ABN, First Publish Date - 2022-06-20T17:08:22+05:30

బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మూవీ ‘జగ్ జగ్ జీయో’. వరుణ్ ధావన్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మూవీ ‘జగ్ జగ్ జీయో’. వరుణ్ ధావన్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లు. అనిల్ కపూర్, నీతూ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జూన్ 24న విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ చిక్కుల్లో పడింది.  రాంచీలో చిత్ర నిర్మాతలపై కాపీరైట్ ఉల్లంఘన కేసు నమోదైంది.


నివేదికల ప్రకారం, రాంచీకి చెందిన రచయిత విశాల్ సింగ్ ధర్మ ప్రొడక్షన్స్,  వయాకామ్ 18పై కాపీరైట్ ఉల్లంఘన కేసును దాఖలు చేశారు. పున్నీ రాణి అనే తన చిత్రానికి సంబంధించిన విషయాలను జగ్‌జగ్ జీయో చిత్రంలో ఉపయోగించారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. మేకర్స్ తనకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేదని ఆయన తెలిపాడు. సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ తరుణంలో ఈ చిత్రాన్ని కోర్టు ముందు ప్రదర్శించాలని రాంచీలోని కమర్షియల్ కోర్టు మేకర్స్‌ను ఆదేశించింది. ఈ కేసులో మూవీ నిర్మాతల నుంచి రచయిత రూ.1.5 కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. మరి ఈ కేసులో కోర్టు తీర్పు సినిమా విడుదలపై ప్రభావం చూపుతుందా లేదా అన్నది చూడాలి.

Updated Date - 2022-06-20T17:08:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!