సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

త్వరలోనే స్టార్ కమెడియన్‌పై బయోపిక్

ABN, First Publish Date - 2022-01-15T00:50:09+05:30

‘‘ కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ ’’ షోతో పేరు తెచ్చుకున్న కమెడియన్ కపిల్ శర్మ. వివిధ అవార్డు షోలను కూడా ఆయన హోస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘ కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ ’’ షోతో పేరు తెచ్చుకున్న కమెడియన్ కపిల్ శర్మ. వివిధ అవార్డు షోలను కూడా ఆయన హోస్ట్ చేశారు. కపిల్ శర్మపై త్వరలోనే బయోపిక్ రాబోతోంది. ఆ సినిమాకు ‘‘ ఫంకార్ ’’ అని టైటిల్ పెట్టారు. ఆ చిత్రానికి మృగ్దీప్ సింగ్ లంబ దర్శకత్వం వహించనున్నారు. గతంలో మృగ్దీప్ ‘‘ ఫుక్రే ’’కు దర్శకత్వం వహించారు. ‘‘ ఫంకార్ ’’కు  మహావీర్ జైన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఆ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది.   


ప్రస్తుతం మృగ్దీప్ సింగ్ ‘‘ ఫుక్రే-3’’ స్క్రిఫ్ట్‌పై పనిచేస్తున్నారు. కపిల్ శర్మ బయోపిక్‌ను ప్రేక్షకులకు చూపెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్టు ఆయన చెప్పారు. ‘‘కోట్లాది మంది ప్రజలకు కపిల్ శర్మ ప్రతిరోజు నవ్వులను పంచారు. మీకు తెలియని కపిల్ శర్మ కథను వెండి తెర మీద చూపెట్టబోతున్నాం ’’ అని మహావీర్ జైన్ చెప్పారు. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మహావీర్ జైన్ ‘‘ రామ్ సేతు’’ సినిమాకు పని చేస్తున్నారు. ఆ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు.



Updated Date - 2022-01-15T00:50:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!