లైంగిక వేధింపుల కేసులో Choreographer Ganesh Acharyaకి బెయిల్
ABN , First Publish Date - 2022-06-24T14:56:18+05:30 IST
బాలీవుడ్లో స్టార్ కొరియోగ్రాఫర్స్‌లో గణేశ్ ఆచార్య ఒకరు. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం (DJ) సినిమాలోని..

బాలీవుడ్లో స్టార్ కొరియోగ్రాఫర్స్‌లో గణేశ్ ఆచార్య ఒకరు. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం (DJ) సినిమాలోని ‘గుడిలో.. బడిలో..’ సాంగ్‌తో టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ సాధించాడు. ఈ పాపులర్ కొరియోగ్రాఫర్‌పై 2020లో ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను కొట్టడమే కాకుండా లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఓ ఫిమేల్ అసిస్టెంట్ గణేశ్‌పై ఫిర్యాదు చేసింది. అందులో.. అలాగే.. జనవరి 26, 2020న అంధేరీలో జరిగిన ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఫంక్షన్లో ఆమె వెళ్లింది. అక్కడి వచ్చిన గణేశ్, మరో ఇద్దరూ అసిస్టెంట్స్‌తో కలిసి తనపై దాడి చేశాడని ఫిర్యాదులో ఆమె ఆరోపించింది. అలాగే.. 2009-10 సమయంలో అతని ఆఫీసుకి వెళ్లినప్పుడు పోర్న్ వీడియోలు చూడమని ఒత్తిడి చేశాడని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో గణేశ్‌పై 354-A (లైంగిక వేధింపులు), 354-C (వ్యక్తిగత చర్యలో నిమగ్నమై ఉన్న స్త్రీని చూడటం లేదా చిత్రీకరించడం), 354-D (వెంబడించడం), 509 (ఒక మహిళ కించపరిచడం), 506 (బెదిరించడం) వంటి పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం తెలిసిన గణేశ్ ఈ ఆరోపణలను కొరియోగ్రాఫర్ ఖండించారు. అయితే.. ఇప్పటివరకూ గణేశ్‌ని పోలీసులు అరెస్టు చేయలేదు. కాగా.. గురువారం మేజిస్ట్రేట్ కోర్టు ముందు అతను హాజరుకాగా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
కాగా.. 51 ఏళ్ల గణేష్ ఆచార్య 1990లో కొరియోగ్రాఫర్ కమల్జీకి అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. 1992లో మొదటి సినిమాకి కొరియోగ్రఫీ చేయగా.. 2001లో వచ్చిన లజ్జా మూవీలోని బడి ముష్కిల్ పాటతో మంచి ఫేమ్ వచ్చింది. అంతేకాకుండా.. 2007లో మనోజ్ బాజ్‌పాయ్, జూహీ చావ్లా హీరోహీరోయిన్లుగా నటించిన ‘స్వామి’ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. అలాగే.. పలు చిత్రాల్లో నటించిన నటుడిగా సైతం గుర్తింపు పొందాడు.