Chetan Bhagat: మన యూత్ బెడ్ మీద పడుకుని ఉర్ఫి జావెద్ పిక్స్ చూస్తుంటుంది

ABN , First Publish Date - 2022-11-25T21:41:04+05:30 IST

సెల్‌ఫోన్ నుంచి పుస్తకాల వైపు యూత్‌ మళ్లేలా చేసిన రచయిత చేతన్ భగత్ (Chetan Bhagat). ‘టూ స్టేట్స్’, ‘పైవ్ పాయింట్ సమ్‌వన్’, ‘త్రీ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్’ వంటి బుక్స్‌తో దేశ వ్యాప్తంగా ఫేమ్‌ను సంపాదించుకున్నాడు.

Chetan Bhagat: మన యూత్ బెడ్ మీద పడుకుని ఉర్ఫి జావెద్ పిక్స్ చూస్తుంటుంది

సెల్‌ఫోన్ నుంచి పుస్తకాల వైపు యూత్‌ మళ్లేలా చేసిన రచయిత చేతన్ భగత్ (Chetan Bhagat). ‘టూ స్టేట్స్’, ‘పైవ్ పాయింట్ సమ్‌ వన్’, ‘త్రీ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్’ వంటి బుక్స్‌తో దేశ వ్యాప్తంగా ఫేమ్‌ను సంపాదించుకున్నాడు. చేతన్ భగత్ తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. మొబైల్‌ ఫోన్, సోషల్ మీడియాకు బానిస అయ్యి ఇండియన్ యూత్ ఏ విధంగా సమయాన్ని వృథా చేస్తుందో చెప్పాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా సెన్సేషన్, బాలీవుడ్ సెలబ్రిటీ ఉర్ఫి జావెద్ (Uorfi Javed) గురించి ప్రస్తావించాడు.      


మహిళల ఫొటోలను  సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడానికే యూత్ ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తుందని చేతన్ తెలిపాడు. ‘‘యువతుల పిక్స్‌కు యూత్ లైక్స్ కొడుతుంటుంది. ఉర్ఫి జావెద్ తరహాలోనే ఫొటోలను షేర్ చేస్తే కోట్లాది లైక్స్ వస్తాయి. అందులో ఆమె తప్పేమీ లేదు. కెరీర్ కోసం ఆమె అటువంటి పిక్స్ షేర్ చేస్తుంది. ఉర్ఫి తరహాలోనే మరో 50మంది ఉంటారు. కార్గిల్‌ నుంచి దేశానికి రక్షించే విధంగా ఇండియన్ యూత్ ఉండాలి. కానీ, మన యూత్ మాత్రం బెడ్ మీద పడుకుని ఉర్ఫి జావెద్ ఫొటోలను చూస్తుంటుంది’’ అని చేతన్ తెలిపాడు. ఉర్పి జావెద్ విషయానికి వస్తే.. హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొని ఫేమ్‌ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో పిక్స్‌ను షేర్ చేస్తూ యూత్ సెన్సేషన్‌గా మారపోయింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 39లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు.      


పుస్తకాల ప్రాధాన్యత గురించి కూడా చేతన్ భగత్ మాట్లాడాడు. ‘‘ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వృథా. ఈ వీడియోస్ మన మెదడును మొద్దుబారేలా చేస్తాయి. రియల్ లైఫ్‌లో వీటితో ఎటువంటి ప్రయోజనం లేదు. మనం జ్ఞానం సంపాదించుకోవడంపై ఈ కంపెనీలు ఆసక్తి కరపరచవు. ఈ సంస్థలు మనకు యాడ్‌లను చూపించడానికే ఇష్టపడతాయి. ఆ విషయం యూత్‌కు అర్థం కాదు’’ అని చేతన్ చెప్పాడు.

Updated Date - 2022-11-25T21:41:04+05:30 IST