అలియా, రణ్ బీర్‌ పెళ్లి, డిన్నర్ డేట్ ఫిక్స్.. వేడుకలు ఎక్కడంటే?

ABN , First Publish Date - 2022-04-08T22:47:17+05:30 IST

సెలబ్రిటీ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్ బీర్ కపూర్ ఏప్రిల్ రెండో వారంలో పెళ్లి

అలియా, రణ్ బీర్‌ పెళ్లి, డిన్నర్ డేట్ ఫిక్స్.. వేడుకలు ఎక్కడంటే?

సెలబ్రిటీ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్ బీర్ కపూర్ ఏప్రిల్ రెండో వారంలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ జంట భార్యాభర్తలుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఏప్రిల్ 16న అలియా భట్ వివాహం చేసుకోబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ, ఆ తేదీన కాకుండా అంతకు ఒక్క రోజు ముందే అంటే ఏప్రిల్ 15నే ఈ జంట వివాహమాడనుందని తెలుస్తోంది.


అలియా-రణ్ బీర్‌ల పెళ్లి వేడుకలు ఏప్రిల్ 14న ప్రారంభమవుతాయని సమాచారం. అలియా నివాసంలోనే ఈ జంట ఏప్రిల్ 15న పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్టు బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వివాహం అనంతరం ఇరువురి తరఫు కుటుంబసభ్యులు కలసి డిన్నర్ చేస్తారని కథనాలు వెలువడుతున్నాయి. పెళ్లి రిసెప్షన్‌ను ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ పార్టీకి బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు హాజరవుతారని తెలుస్తోంది. అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్ సమయంలో వీరికి ఒకరితో మరొకరికి స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఈ జంట అప్పటి నుంచి డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. అలియా ఈ మధ్యే..‘ఆర్ఆర్‌ఆర్’ చిత్రంలో కనిపించింది. ఆమె నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక రణ్‌బీర్ కపూర్..‘షంషేరా’లో హీరోగా నటించాడు. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోయే ‘యానిమల్’లోను కనిపించనున్నాడు.

Updated Date - 2022-04-08T22:47:17+05:30 IST

Read more