Shah Rukh Khan: ‘పఠాన్’ కు సెన్సార్ బోర్డ్ షాక్!

ABN , First Publish Date - 2022-12-29T19:52:42+05:30 IST

బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan), దీపికా పదుకొణె (Deepika Padukone) హీరో, హీరోయిన్‌గా నటించిన సినిమా పఠాన్ (Pathaan). స్టార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది.

Shah Rukh Khan: ‘పఠాన్’ కు సెన్సార్ బోర్డ్ షాక్!

బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan), దీపికా పదుకొణె (Deepika Padukone) హీరో, హీరోయిన్‌గా నటించిన సినిమా పఠాన్ (Pathaan). స్టార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. షారూఖ్ నుంచి నాలుగేళ్ల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ‘పఠాన్’ పై భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ కూడా ఆ అంచనాలను అమాంతం పెంచేసింది. కానీ, ‘బే శరం’ పాట విడుదల కాగానే ఈ మూవీని వివాదాలు చుట్టుముట్టాయి. ఈ పాటపై అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఈ సాంగ్ ఉందని పలువురు ఆరోపించారు. అందువల్ల పఠాన్ నుంచి ఆ పాటను తీసేయాలని కోరారు. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది.

పఠాన్ టీమ్ తాజాగా సెన్సార్ సర్టిఫికేట్‌కు అప్లై చేసుకోగా.. సినిమాలోని పలు సన్నివేశాలపై సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటలలో కొన్ని మార్పులు చేయాలని సూచించింది. అనంతరం రివైజ్డ్ వెర్షన్‌తో సెన్సార్‌ సర్టిఫికేట్‌‌కు అప్లై చేసుకోవాలని కోరింది. ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్న సన్నివేశాలను తొలగించాలని సీబీఎఫ్‌సీ కోరినట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. పఠాన్ సినిమా వివాదంలో చిక్కుకోవడానికి ముఖ్య కారణం ‘బే శరం రంగ్’ సాంగ్. ఈ పాటలో దీపికా పదుకొణె ధరించిన బికినీపై అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. మూవీని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. అందువల్ల సీబీఎఫ్‌సీ.. సినిమా విడుదల అయ్యాక ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకు మార్పులు చేయాలని కోరినట్టు తెలుస్తోంది. ఇక పఠాన్ విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2022-12-29T19:54:25+05:30 IST