Brahmastra : ఫస్ట్ రివ్యూ

ABN , First Publish Date - 2022-09-06T17:08:08+05:30 IST

బాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). ఇటీవల కాలంలో స్టార్ హీరోల చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫ్యూచర్‌ను డిసైడ్ చేసే చిత్రంగా అందరికీ ‘బ్రహ్మా్స్త్ర’ కనిపిస్తోంది.

Brahmastra : ఫస్ట్ రివ్యూ

బాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). ఇటీవల కాలంలో స్టార్ హీరోల చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫ్యూచర్‌ను డిసైడ్ చేసే చిత్రంగా అందరికీ ‘బ్రహ్మా్స్త్ర’ కనిపిస్తోంది. అత్యధిక బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. నార్త్ తో పాటు సౌత్ లోనూ ఈ సినిమాకి భారీ ప్రమోషన్స్ చేశారు. రణబీర్ కపూర్ (Ranabeer kapoor), అమితాబ్ బచ్చన్ (Amitab Bachan), అలియా భట్ (Alia Bhatt) లాంటి స్టార్ కేస్టింగ్‌తో విజువల్ వండర్‌గా చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం రాజమౌళి, చిరంజీవి రంగంలోకి దిగారు. 


ప్రపంచ వ్యాప్తంగా చిత్రం భారీ ఎత్తున ఈ నెల 9న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను వీక్షించిన ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, క్రిటిక్ అయిన ఉమైర్ సంధు (Umair Sandhu).. తన్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం ఫస్ట్ రివ్యూ పోస్ట్ చేశారు. ‘హై వియఫ్ ఎక్స్ విజువల్స్ తో రూపొందిన ఈ సినిమాలోని పలు సన్నివేశాల్ని అద్బుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు. సినిమాటోగ్రఫీ కనుల విందు చేస్తుంది. కొన్ని సన్నివేశాల్లో లైటింగ్ మరీ డార్క్ గా ఉంది.  ప్రొడక్షన్ డిజైనింగ్ అమేజింగ్. స్టోరీ, స్ర్కీన్ ప్లే మాత్రం యావరేజ్. ఇంటర్వెల్ పోర్షన్ లోని సన్నివేశాలు బోరింగ్ గా ఉన్నాయి. సంగీతానికి 2.5 రేటింగ్ ఇస్తాను. 


రణబీర్ కపూర్ అద్భుతంగా నటించాడు. తన పార్ట్ ను ఎంతో కన్విన్సింగ్ గా చేశాడు. కొన్ని సన్నివేశాల్లో కన్ఫ్యూజింగ్‌గా కనిపించాడు. అమితాబ్ బచ్చన్ మనసు దోచుకున్నారు. మౌనీ రాయ్ (Mouni Roy) ఇంకా నాగిన్ మోడ్ లోనే ఉంది. ఆమె అంతగా ఆకట్టుకోదు. ఆలియాభట్ క్యూట్ గా కనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే.. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో ఆత్మ మిస్ అయింది. ప్రమోషన్స్ బాగా చేయడం వల్ల ఫస్ట్ వీకెండ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే ఆశించిన స్థాయిలో  వసూళ్ళు వస్తాయని చెప్పలేను. ఇందులో షారుఖ్ ఖాన్ కనిపించడం గొప్ప విషయం’ అని సినిమా గురించి ట్వీట్ చేశారు ఉమైర్. 





Updated Date - 2022-09-06T17:08:08+05:30 IST