సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Salman Khan- Revathy: 32ఏళ్ల తర్వాత జోడీగా..

ABN, First Publish Date - 2022-11-28T00:01:27+05:30

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). అభిమానులందరు ముద్దుగా భాయ్‌జాన్ అని పిలుస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). అభిమానులందరు ముద్దుగా భాయ్‌జాన్ అని పిలుస్తుంటారు. అత్యధికంగా వంద కోట్ల వసూళ్లను సాధించిన చిత్రాల రికార్డు ఇప్పటికే సల్లూ భాయ్ పేరిటే ఉంది. తాజాగా అతడు ఆసక్తికర విషయం తెలిపాడు. సీనియర్ హీరోయిన్‌తో సినిమా చేయనున్నట్టు చెప్పాడు.   


సల్మాన్ ఖాన్ హిందీ ‘బిగ్‌బాస్ 16’ రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే వీకెండ్ కా వార్ జరిగింది. ఈ ఎపిసోడ్‌కు కాజోల్ (Revathy), రేవతి హాజరయ్యారు. తమ చిత్రం సలామ్ వెంకీ (Salaam Venky) ని ప్రమోట్ చేశారు. ‘సలామ్ వెంకీ’ కి రేవతి దర్శకత్వం వహించింది. కాజోల్ కీలక పాత్ర పోషించింది. వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో భాగంగా రేవతితో కలసి సినిమా చేయనున్నట్టు సల్మాన్ ఖాన్ తెలిపాడు. ‘టైగర్ 3’ (Tiger 3)లో జంటగా కనిపించనున్నట్టు వెల్లడించాడు. 32ఏళ్ల తర్వాత ఈ జోడీ స్క్రీన్‌ను షేర్ చేసుకోబోతున్నారు. గతంలో సల్మాన్, రేవతి కలసి రొమాంటిక్ ఫిలిం ‘లవ్’ (Love) లో నటించారు. 1991లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ‘టైగర్ 3’ ని యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్‌కు విడుదల కావాలి. కానీ, మేకర్స్ రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేశారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ్‌లో విడుదల కానుంది.

Updated Date - 2022-11-28T00:01:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!