ప్రేమించుకోవడం మొదలుపెట్టి రెండేళ్లు గడిచాయంటున్న Aamir Khan కూతురు Ira Khan

ABN , First Publish Date - 2022-06-01T22:25:49+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) కూతురు ఐరాఖాన్‌ (Ira Khan) సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. తన జీవితానికి సంబంధించిన విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో

ప్రేమించుకోవడం మొదలుపెట్టి రెండేళ్లు గడిచాయంటున్న Aamir Khan కూతురు Ira Khan

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) కూతురు ఐరాఖాన్‌ (Ira Khan) సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. తన జీవితానికి సంబంధించిన విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటునే ఉంటుంది. తన లవ్ లైఫ్ గురించి కూడా బహిరంగంగా వెల్లడిస్తుంటుంది. నుపుర్ షీఖరే (Nupur Shikhare) అనే వ్యక్తిని ఐరా రెండేళ్లుగా ప్రేమిస్తుంది. ఈ లవ్‌బర్డ్స్ 2020 కోవిడ్ లాక్‌డౌన్ నుంచి డేటింగ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఐరా పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఒక్కొక్కొటిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. బర్త్ డే సందర్భంగా స్విమ్మింగ్ ఫూల్‌లో నుపుర్‌తో తీసుకున్న ఫొటోలను మే 31న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ పిక్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘‘మనం ప్రేమించుకోవడం మొదలుపెట్టి రెండేళ్లు గడిచాయి. కానీ, ఇప్పుడే లవ్ చేసుకోవడం ప్రాంరంభించినట్టు అనిపిస్తుంది. ఐ లవ్ యూ. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’’ అని ఐరా ఖాన్ తెలిపింది. ఈ పిక్‌కు నుపుర్ షీఖరే లవ్ ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు. ‘‘ఐ లవ్ యూ టూ. మనం ప్రేమించుకోవడం మొదలుపెట్టి రెండేళ్లు అయిందని ఇప్పుడే నేను గ్రహించాను’’ అని నుపుర్ రిప్లై ఇచ్చాడు.   


 తన 25వ పుట్టిన రోజును ఐరా ఖాన్ కొన్ని రోజుల క్రితమే జరుపుకొంది. ఈ వేడుకల్లో ఆమె తల్లిదండ్రులు ఆమిర్ ఖాన్, రీనా దత్తాతో పాటు స్నేహితులు కూడా పాల్గొన్నారు. ఐరా పుట్టిన రోజు వేడుకలను బికినీలోనే జరుపుకొంది. తల్లిదండ్రుల ముందు బికినీ వేసుకోవడంతో నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్‌కు ఆమె ధీటుగా బదులిచ్చింది. అటువంటి ఫొటోలనే మరికొన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘నా చివరి బర్త్ డేకు సంబంధించిన ఫొటోలను చూసి చాలా మంది ట్రోల్స్ చేశారు. మీ కోసం మరిన్ని పిక్స్’’ అని ఐరా ఖాన్ వెల్లడించింది. ఐరా బాలీవుడ్‌లోకి డైరెక్టర్‌గా 2019లోనే ఎంట్రీ ఇచ్చింది. ‘మీడియా’ అనే నాటకానికి దర్శకత్వం వహించింది.Updated Date - 2022-06-01T22:25:49+05:30 IST

Read more