కొత్త అపార్ట్‌మెంట్ కొన్న Akshay Kumar.. ధర వింటే షాకే..
ABN , First Publish Date - 2022-01-24T21:03:21+05:30 IST
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడిగా అక్షయ్ కుమార్‌కి పేరుంది. కరోనా కాలంలోను వరుస చిత్రాలను పట్టాలెక్కిస్తూ అతడు పుల్ బిజీగా ఉన్నాడు

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుల్లో అక్షయ్ కుమార్ ఒకరు. కరోనా కాలంలోను వరుస చిత్రాలను పట్టాలెక్కిస్తూ అతడు పుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో అర డజనుకి పైగా సినిమాలు ఉన్నట్టు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ‘ఖిలాడీ’ స్టార్‌కు సంబంధించిన ఓ వార్త బీ టౌన్‌లో హల్ చల్ చేస్తోంది. అతడు కోట్లు వెచ్చించి విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొన్నాడనేది ఆ న్యూస్.
బాలీవుడ్ మీడియా ప్రకారం.. ముంబైలోని ఖర్ వెస్ట్‌లో ఇటీవల ఒక అపార్ట్‌మెంట్‌ను కొన్నాడు. దాని విస్తీర్ణం 1878 చదరపు అడుగులట. ఖర్ వెస్ట్‌లో జాయ్ లెజెండ్ అనే భవంతిలో 19వ ఫ్లోర్‌లో ఆ అపార్ట్‌మెంట్ ఉంది. ఆ అపార్ట్‌మెంట్ ధర రూ.7.8కోట్లు అని తెలుస్తోంది. జనవరి 7న రిజిస్ట్రేషన్ జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం అక్షయ్ జుహులోని డూఫ్లెక్స్ భవంతిలో నివసిస్తున్నాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. బచ్చన్ పాండే, పృథ్వీరాజ్, రక్షా బంధన్, రామ్ సేతు, మిషన్ సిండ్రెల్లా, గోర్ఖా, ఓ మై గాడ్ -2 తదితర సినిమాల్లో నటిస్తున్నాడు.