సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హృతిక్‌ను ‘మై క్యూట్’ అంటున్న సబా.. తమ బంధాన్ని త్వరలోనే ప్రపంచానికి తెలపనున్నారా..?

ABN, First Publish Date - 2022-03-27T01:47:59+05:30

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌, బీ టౌన్ బ్యూటీ, సింగర్ అయిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌, బీ టౌన్ బ్యూటీ, సింగర్ అయిన సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట అనేక సార్లు డిన్నర్‌ చేసేందుకు బయటకు వచ్చి మీడియా కంట కూడా పడింది. సబా కొన్ని రోజుల క్రితం హృతిక్ ఇంటికి కూడా వెళ్లింది. స్టార్ హీరో ఇంట్లో భోజనం చేసింది. ఆ ఫొటోలు నెట్టింట కూడా వైరల్‌గా మారాయి. ఈ జంట తరచుగా కలుస్తుండటంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ, తమ రిలేషన్‌షిప్‌పై వీరిద్దరూ ఎప్పుడు కూడా స్పందించలేదు. తాజాగా మరోసారి వీరిద్దరూ పతాక శీర్షికలకెక్కారు.


సబా ఆజాద్ ఓ ఈవెంట్ కోసం ఫుణెకు వెళ్లింది. అక్కడ తీసుకున్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. సబాకు శుభాకాంక్షలు చెబుతూ ఈ పిక్‌ను హృతిక్ రోషన్ వెంటనే రీ షేర్ చేశాడు. ‘‘నేను ఈ ఈవెంట్‌లో ఉండాలని కోరుకుంటున్నాను. నీ ప్రదర్శనతో అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేయాలి’’ అని హృతిక్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు సబా రిప్లై ఇచ్చింది. ‘‘మీరు ఇక్కడ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. మై క్యూట్’’ అని సబా స్పందించింది. స్టార్ హీరో కుటుంబంతో కూడా ఆమె మంచి రిలేషన్‌షిప్ కొనసాగిస్తుంది. సబా ఆజాద్‌కు హృతిక్ మాజీ భార్య సుసానే ఖాన్‌తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. హృతిక్, సబా ఆజాద్ త్వరలోనే తమ బంధాన్ని అధికారికంగా ప్రపంచానికి వెల్లడించనుందని బాలీవుడ్ మీడియా కూడా తెలుపుతోంది.

Updated Date - 2022-03-27T01:47:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!