సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Laal Singh Chaddha: ఆ రోజు నుంచే ఓటీటీలో ఆమిర్ సినిమా..!

ABN, First Publish Date - 2022-09-05T20:33:36+05:30

విభిన్న సినిమాలు, వైవిధ్య పాత్రలతో ప్రేక్షకులను అలరించే నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). తాజాగా అతడు నటించిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). అద్వైత్ చందన్ దర్శకత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభిన్న సినిమాలు, వైవిధ్య పాత్రలతో ప్రేక్షకులను అలరించే నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). తాజాగా అతడు నటించిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. అమెరికన్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ‘లాల్ సింగ్ చడ్డా’ లో కరీనా కపూర్, అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదలైంది. ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి రాబోతున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. 


‘లాల్ సింగ్ చడ్డా’ ను రూ. 180కోట్లతో భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఈ చిత్రం అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ‘లాల్ సింగ్ చడ్డా’ విడుదలకు ముందు ఆరు నెలల వరకు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి రాదని ఆమిర్ తెలిపాడు. కానీ, బాక్సాఫీస్ వద్ద సినిమా దారుణంగా పరాజయం పాలవ్వడంతో రెండు నెలలకే డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి వస్తుంది. ‘లాల్ సింగ్ చడ్డా’ పాన్ ఇండియాగా రూపొందింది. పలు భాషల్లో విడుదలైంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పించాడు. కానీ, మూవీ విడుదలకు ముందు ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ గతంలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట్ వైరల్‌గా మారాయి. దీంతో అనేక మంది నెటిజన్స్ ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.

Updated Date - 2022-09-05T20:33:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!