బాయ్ ఫ్రెండ్‌తో బాలీవుడ్ భామ Rakhi Sawant నిశ్చితార్థం.. దూరంగా ఉండాలని హెచ్చరించిన అతడి మాజీ గర్ల ఫ్రెండ్..

ABN , First Publish Date - 2022-05-23T23:45:45+05:30 IST

బాలీవుడ్‌లో ఐటం సాంగ్స్‌తో ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ రాఖీ సావంత్ (Rakhi Sawant). కొన్ని రోజుల క్రితమే భర్త రితేశ్‌కు రాఖీ విడాకులిచ్చింది. అతడి టాటును కూడా తొలగించింది. తాజాగా ఆమె

బాయ్ ఫ్రెండ్‌తో బాలీవుడ్ భామ Rakhi Sawant నిశ్చితార్థం.. దూరంగా ఉండాలని హెచ్చరించిన అతడి మాజీ గర్ల ఫ్రెండ్..

బాలీవుడ్‌లో ఐటం సాంగ్స్‌తో ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ రాఖీ సావంత్ (Rakhi Sawant). కొన్ని రోజుల క్రితమే భర్త రితేశ్‌కు రాఖీ విడాకులిచ్చింది. అతడి టాటును కూడా తొలగించింది. తాజాగా ఆమె మరొకరితో లవ్‌లో పడింది. బిజినెస్ మ్యాన్ ఆదిల్ ఖాన్ దుర్రానీ(Adil Khan Durrani)తో ప్రేమలో మునిగితేలుతుంది. ఈ జంటకు ఇప్పటికే నిశ్చితార్థం అయింది. త్వరలోనే అతడిని పెళ్లి చేసుకొబోతున్నట్టు తెలుస్తోంది. ఈ జంట కొత్త బంధాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆదిల్ మాజీ గర్ల్ ఫ్రెండ్ రాఖీకీ ఫోన్ చేసి అతడికి దూరంగా ఉండాలని హెచ్చరించడం విశేషం. 


ఆదిల్ దుర్రానీ మాజీ గర్ల్ ఫ్రెండ్ రోషినా దెలవారి (Roshina Delavari) ఫోన్ రావడంతోనే రాఖీ సావంత్ షాక్‌కు గురయింది. తాను, ఆదిల్ నాలుగేళ్లు రిలేషన్‌షిప్ కొనసాగించామని ఫోన్‌లో రోషిన తెలిపింది. దీంతో ఆదిల్‌ను ఈ విషయంపై రాఖీ ప్రశ్నించింది. అందుకు ఆదిల్ సమాధానమిస్తూ ఆమెతో గతంలో డేటింగ్ చేశానని ప్రస్తుతం చేయడం లేదని చెప్పినట్టు సమాచారం. ఆదిల్ దుర్రానీ, రోషినా దెలవారి మొదటిసారి మైసూర్‌లో కలుసుకున్నారు. అనంతరం డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఏమైందో తెలియదు కానీ కొన్నాళ్లకు విడిపోయారు. రాఖీ సావంత్‌తో ఏం చెప్పాననే విషయంపై స్పందించడానికీ రోషిన నిరాకరించింది. రోషిన ఫోన్ చేసినప్పటికీ రాఖీ ఏ మాత్రం చలించలేదని తెలుస్తోంది. ‘‘ఆదిల్ మాజీ గర్ల్ ఫ్రెండ్ రోషిన నాకు ఫోన్ చేసింది. అయినప్పటికీ ఆదిల్ నా వాడే. నేను అతడిని పెళ్లి చేసుకోబోతున్నాను’’ అని రాఖీ సావంత్ పేర్కొంది.

Updated Date - 2022-05-23T23:45:45+05:30 IST

Read more