ఘనంగా బాలీవుడ్ హీరోయిన్ మెహందీ ఫంక్షన్.. పిక్స్ వైరల్..
ABN, First Publish Date - 2022-01-27T00:23:47+05:30
బాలీవుడ్లో గతేడాది ఎక్కడ చూసినా పెళ్లి, పెళ్లి అనే పదాలే ఎక్కువగా వినిపించాయి. అనుష్క రంజన్-ఆదిత్య సీల్, పత్రలేఖ-రాజ్ కుమార్ రావ్
బాలీవుడ్లో గతేడాది ఎక్కడ చూసినా పెళ్లి, పెళ్లి అనే పదాలే ఎక్కువగా వినిపించాయి. అనుష్క రంజన్-ఆదిత్య సీల్, పత్రలేఖ-రాజ్ కుమార్ రావ్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ తదితరులు 2021లో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది కూడా బాలీవుడ్లో పెళ్లి భాజాలు చాలానే మోగనున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాదిలో తొలుత నాగినీ బ్యూటీ మౌనీరాయ్ వైవాహిక జీవితాన్ని ప్రారంభించనుంది. బిజినెస్మెన్ సూరజ్ నంబియార్‌ను ఆమె జనవరి 27న గోవాలో వివాహమాడనుంది. ఈ పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. తాజాగా హల్దీ, మెహందీ ఫంక్షన్‌కి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మౌనీరాయ్ స్నేహితులైన జియా ముస్తాఫా, అర్జున్ బిజిలానీ అతడి భార్య నేహా స్వామి బిజిలానీ ఆ ఫంక్షన్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫంక్షన్లో ఆమె పసుపు కలర్ లెహంగా ధరించి కనిపించింది. మరో ఫొటోలో సూరజ్ నంబియార్ కూడా కనిపించారు. ఆయన తెలుపురంగు దుస్తులు ధరించారు. హల్దీ, మెహందీ వేడుకలు బుధవారం జరిగినట్టు సమాచారం.