కొత్త కారు కొన్న బాలీవుడ్ హీరో.. ధర వింటే షాకే..

ABN , First Publish Date - 2022-04-03T22:21:53+05:30 IST

బాలీవుడ్‌లో కొత్త రకం పాత్రలను పోషిస్తూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న నటుడు షాహిద్ కపూర్

కొత్త కారు కొన్న బాలీవుడ్ హీరో.. ధర వింటే షాకే..

బాలీవుడ్‌లో కొత్త రకం పాత్రలను పోషిస్తూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న నటుడు షాహిద్ కపూర్. తెలుగులో హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. అదే ఊపులో టాలీవుడ్ హిట్ చిత్రం ‘జెర్సీ’ని పట్టాలెక్కించాడు. ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. 


బీ టౌన్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ ఈ మధ్య కొత్త కారును కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన గ్యారేజీలో మెర్సిడెస్ మేబాచ్ ఎస్-580కీ అతడు చోటు కల్పించాడు. ఈ కారు ధర దాదాపుగా రూ. 3కోట్ల దాకా ఉంటుందని ఆటో ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. మెర్సిడెస్ కారుతో తీసుకున్న వీడియోని షాహిద్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘ఫాలింగ్ బ్యాక్ బ్యాచ్’ అని అతడు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో కాసేపటికే నెట్టింట వైరల్‌గా మారింది. అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పోస్ట్ కింద కామెంట్ చేశారు. ర్యాప్ సింగర్ బాద్ షా ‘‘ఏప్రిల్‌లో మేబాచ్’’ అని రిప్లై ఇచ్చాడు. షాహిద్ దగ్గర ఇప్పటికే విలాసవంతమైన అనేక కార్లు ఉన్నాయి. జాగ్వార్, రేంజ్ రోవర్, మెర్సిడెస్, పోర్షే వంటి బ్రాండ్స్ ఉన్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.Updated Date - 2022-04-03T22:21:53+05:30 IST

Read more