హృతిక్ మేనకోడలి sweet సర్‌ప్రైజ్... గ్రీకు వీరుడి ప్రియురాలి రియాక్షన్ ఏంటంటే...

ABN , First Publish Date - 2022-03-17T23:49:16+05:30 IST

అప్ కమింగ్ బీ-టౌన్ బ్యూటీ, సింగర్ సబా ఆజాద్‌తో బాలీవుడ్

హృతిక్ మేనకోడలి sweet సర్‌ప్రైజ్... గ్రీకు వీరుడి ప్రియురాలి రియాక్షన్ ఏంటంటే...

అప్ కమింగ్ బీ-టౌన్ బ్యూటీ, సింగర్ సబా ఆజాద్‌తో బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్  డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ జంటగా మీడియా కంట కూడా పడ్డారు. సబా కొన్ని రోజుల క్రితం స్టార్ హీరో ఇంటికి వెళ్లి భోజనం చేసిన సంగతి కూడా మీడియాలో చర్చకు దారి తీసింది. ఆ ఫొటోలను సబా స్వయంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. అప్పట్లో ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.


హృతిక్ మేనకోడలు సురానికా తాజాగా సబా ఆజాద్‌ను సర్‌ప్రైజ్ చేసింది. సురానికా తన చేతితో హల్వాను తయారు చేసి సబాకు పంపించింది.  ఈ హల్వాను అందుకున్న సబా ఆనందంతో పొంగిపోయింది. స్వీట్‌ను ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘నువ్వు ఎంత మంచి దానివి సురానికా. నాకు హల్వా అంటే ప్రాణాలిచ్చేంత ఇష్టం’’ అని ఇన్‌స్టా‌స్టోరీస్‌లో సబా క్యాప్షన్ ఇచ్చింది.   


కెరీర్ విషయానికి వస్తే సబా ఆజాద్ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ‘దిల్ కబడ్డీ’, ‘ముఝసే ఫ్రెండ్ షిప్ కరోగి’ వంటి చిత్రాలు చేసింది. ‘రాకెట్ బాయ్స్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా ఓ కీలక పాత్రను పోషించింది. ఈ వెబ్ సిరీస్‌లో జిమ్ సర్భ్, ఇష్వక్ సింగ్, రెజీనా కసాండ్రా తదితరులు నటించారు. ప్రముఖ శాస్త్రవేత్త హోమీ జే. బాబా పాత్రను జిమ్ సర్భ్ పోషించగా, మరో లెజెండ్రీ ఇండియన్ సైంటిస్ట్ విక్రమ్ సారాభాయ్ పాత్రలో ఇష్వక్ సింగ్ నటించారు. యువకుడైన హోమీ బాబా లవర్ పాత్రలో సబా కనిపించింది.

Updated Date - 2022-03-17T23:49:16+05:30 IST

Read more