హృతిక్ ‘క్రిష్-4’ పనులు ప్రారంభం అయ్యేది అప్పుడే
ABN, First Publish Date - 2022-03-14T23:01:42+05:30
కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్
కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్. ‘క్రిష్’ సినిమాతో ఇండియన్ సూపర్ హీరో పాత్రను భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇప్పటికే ఈ ‘క్రిష్’ సిరీస్‌లో మూడు ప్రాజెక్టులు వచ్చాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు మరో భాగం ‘క్రిష్-4’ రూపంలో జత కాబోతోంది. ‘క్రిష్-4’ మూవీకి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
‘క్రిష్-4’ ప్రీ ప్రొడక్షన్ పనులు ఈ ఏడాది జూన్‌లో ప్రారంభం కానున్నాయని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్‌ను కూడా అప్పుడే మొదలుపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ను ఇంకా ఫైనలైజ్ చేయలేదని సమాచారం. బాలీవుడ్ గ్రీకు వీరుడు నటిస్తున్న ప్రస్తుత సినిమాలన్నీ పూర్తి కాగానే ‘క్రిష్-4’ ను పట్టాలెక్కించనున్నాడు.
ప్రస్తుతం హృతిక్ ‘విక్రమ్ వేద’ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. పుష్కర్, గాయత్రి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రం పూర్తికాగానే సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్న ‘ఫైటర్’ లో నటించనున్నాడు. ఈ ప్రాజెక్టులన్ని పూర్తి కాగానే ‘క్రిష్-4’ను మొదలుపడతాడు.