సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అనుకున్నదానికంటే ముందుగానే Amazon Prime లోకి Runway 34.. కానీ ఈ సినిమాను చూడాలంటే..

ABN, First Publish Date - 2022-05-30T21:44:07+05:30

బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్ (Ajay Devgn) హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా ‘రన్ వే-34’(‘Runway 34). రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), అమితాబ్ బచ్చన్ (Amitabh

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్ (Ajay Devgn) హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా ‘రన్ వే-34’(‘Runway 34). రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ఆకాంక్ష సింగ్, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏవియేషన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ అభిమానుల మెప్పు పొందనప్పటికీ విమర్శకుల ప్రశంసలను మాత్రం దక్కించుకుంది. తన సొంత నిర్మాణ సంస్థ అజయ్ దేవగణ్ ఫిలిమ్స్‌పై ఈ సినిమాను అజయ్ దేవగణే నిర్మించాడు. ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వీక్షకులు ప్రైమ్ వీడియోకు రూ.199ల అద్దె చెల్లించి 4కే ఫార్మాట్‌ను చూడవచ్చు.


‘రన్ వే-34’ ప్రేక్షకులకు అందుబాటులోకి రావడంతో అజయ్ దేవగణ్ మీడియాతో మాట్లాడాడు. ‘‘ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్టు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె ప్రాతిపదికన ఈ చిత్రాన్ని ముందుగానే వీక్షించవచ్చు. నేను నటించే సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు చూడాలనుకుంటాను. అమెజాన్‌ మూవీ రెంటల్స్‌తో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు తమకు నచ్చిన సమయలో ఈ మూవీని చూడవచ్చు. ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్స్ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఇంట్లోనే కూర్చుని జూన్ 3నుంచి అద్దె చెల్లించకుండా కూడా సినిమాను వీక్షించవచ్చు’’ అని అజయ్ దేవగణ్ తెలిపాడు. ఈ చిత్రాన్ని రియల్ ఘటనలను ఆధారంగా చేసుకుని అజయ్ దేవగణ్ నిర్మించాడు. ఈ సినిమాలో విక్రాంత్ ఖన్నా అనే ఫైలెట్‌గా అజయ్ కనిపించాడు.

Updated Date - 2022-05-30T21:44:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!