హీరోయిన్ చీరలను ఇస్త్రీ చేసిన వ్యక్తే.. ఈ రోజు టాప్ డైరెక్టర్..

ABN , First Publish Date - 2022-03-17T02:16:07+05:30 IST

బాలీవుడ్‌లో యాక్షన్, కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన

హీరోయిన్ చీరలను ఇస్త్రీ చేసిన వ్యక్తే.. ఈ రోజు టాప్ డైరెక్టర్..

బాలీవుడ్‌లో యాక్షన్, కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు రోహిత్ శెట్టి. ఈ మధ్య అతడి నుంచి వచ్చిన సినిమా ‘సూర్యవంశీ’. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. కరోనా అనంతరం విడుదల అయిన ఈ మూవీ రికార్డు కలెక్షన్లు సాధించి అందరినీ ఆశ్చర్య‌పరిచింది. నేడు ఒక్కో సినిమాకు రూ. 25కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్న రోహిత్ శెట్టి.. తొలి సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన రోహిత్.. గతంలో ఓ హీరోయిన్ చీరలను ఇస్త్రీ చేశాడంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి, రోహిత్ శెట్టి జీవితంలోని ఆసక్తికరమైన సంగతులను తెలుసుకుందామా..


బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన రోహిత్ శెట్టి ఆస్తుల విలువ రూ.280కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందట. నెలకు దాదాపుగా రూ.3కోట్లు సంపాదిస్తాడని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. అతడు ఏడాదికి రూ.35 కోట్ల నుంచి రూ.40కోట్లు అర్జిస్తాడని తెలుస్తోంది. దర్శకత్వం వహించడంతో పాటు, హోస్టింగ్, యాడ్‌ల ద్వారా ఈ ఆదాయం వస్తుంది. ఈ స్టార్ డైరెక్టర్‌కు నవీ ముంబైలో ఓ విలాసవంతమైన భవనం ఉంది. దీని విలువ దాదాపుగా రూ.6కోట్లు ఉంటుందట. కోట్ల విలువ‌జేసే కార్లు కూడా అతడి గ్యారేజీలో ఉన్నాయి. ఒక్కో చిత్రానికి రెమ్యునరేషన్‌గా రూ.25కోట్ల నుంచి రూ.30కోట్లు తీసుకుంటాడని బీ టౌన్ మీడియా టాక్. 


రోహిత్ శెట్టి చిన్నప్పటి నుంచే పనిచేయడం ప్రారంభించాడు. అతడికి 17ఏళ్లున్నప్పుడే అజయ్ దేవగణ్ నటించిన ‘ఫూల్ ఔర్ కాంటే’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అతడు ఓ చిత్రానికి పారితోషికంగా రూ.35లను వేతనంగా అందుకున్నాడు. ఈ రెమ్యునరేషనే అతడి తొలి సంపాదన. చాలా చిత్రాల్లో చిన్న, చిన్న పాత్రలు వేశాడు. బాలీవుడ్ నటి అయిన టబు చీరలను కూడా ఇస్త్రీ చేశాడు.

Updated Date - 2022-03-17T02:16:07+05:30 IST

Read more