అక్కడే అలియా, రణ్‌బీర్‌ల పెళ్లి

ABN , First Publish Date - 2022-04-03T01:55:28+05:30 IST

బాలీవుడ్ సెలబ్రిటీ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్ బీర్ కపూర్

అక్కడే అలియా, రణ్‌బీర్‌ల పెళ్లి

బాలీవుడ్ సెలబ్రిటీ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఏప్రిల్ రెండో వారంలో వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకకు బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 


అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బదులుగా భారత్‌లోనే పెళ్లాడనున్నారు. ఈ లవ్‌బర్డ్స్ దంపతులుగా కొత్త ప్రయాణాన్ని ముంబైలోనే ప్రారంభించబోతున్నారు. కపూర్‌ల పూర్వీకులకు ముంబై, చెంబూరులో ఆర్‌కే హౌస్ పేరుతో ఓ ఇల్లు ఉంది. వీరి వివాహనికీ ఈ ఆర్‌కే హౌసే వేదిక కానుందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ వేదికను రణ్‌బీర్ కపూరే ఎంపిక చేశాడట. రణ్‌బీర్ తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్‌ల పెళ్లి ఈ ఆర్‌కే హౌస్‌లోనే జరిగింది. దీంతో రణ్‌బీర్ సెంటిమెంట్‌గా భావించి ఇక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. పెళ్లి జరిగే తేదీని మాత్రం గోప్యంగా ఉంచారు. ఇక భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో అలియా, రణ్‌బీర్ తొలిసారి కలసి నటించారు. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న ‘బ్రహ్మాస్త్ర’  విడుదల కానుంది. గతేడాది అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఒకరి తర్వాత మరొకరు పెళ్లి పీటలను ఎక్కారు. విక్కీ కౌశల్- కత్రినా కైఫ్, రాజ్ కుమార్ రావ్-పత్రలేఖ, మౌనీరాయ్-సూరజ్ నంబియార్ తదితరులు వివాహం చేసుకున్నారు. వీరి బాటలోనే నడుస్తూ అలియా- రణ్‌బీర్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు.

Updated Date - 2022-04-03T01:55:28+05:30 IST

Read more