ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మలైకా అరోరా

ABN , First Publish Date - 2022-04-03T23:35:17+05:30 IST

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఏప్రిల్ 2న కారు ప్రమాదానికి గురైంది. పూణేలో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో పాల్గొని,

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మలైకా అరోరా

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఏప్రిల్ 2న కారు ప్రమాదానికి గురైంది. పూణేలో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో పాల్గొని, మలైకా తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్ హైవే‌పై ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో ఆమెకు స్వల్ప గాయలు అయ్యాయి. చికిత్స కోసం నవీ ముంబైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. తాజాగా అపోలో వైద్యులు ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో మలైకా తన ఇంటికీ  చేరుకుంది. 


మలైకా ఇంటికి చేరుకున్న వెంటనే ఆమె సోదరి అమృతా అరోరా వచ్చి పరామర్శించింది. పూణేలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని మలైకా అరోరా తిరిగి ముంబైకి వస్తుండగా యాక్సిడెంట్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ముంబై శివార్లలో ప్రమాదం జరిగిందట. ఓ బస్సు, మూడు కార్లు అదుపు తప్పి ఢీకొట్టుకోవటంతో మలైకా గాయాలపాలు కావాల్సి వచ్చింది. ఆమె ప్రయాణీస్తోన్న రేంజ్ రోవర్ కారు కూడా డ్యామేజ్ అయింది. ఇక మలైకా కెరీర్ విషయానికి వస్తే.. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘కెవ్వు కేక’ పాటలో ఆమె కనిపించింది. అభిమానులను ఫిదా చేసింది. కొన్నాళ్ల క్రితం భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తుంది. పలు రియాలిటీ షోస్‌కు కూడా జడ్జీగా వ్యవహరిస్తుంది.Updated Date - 2022-04-03T23:35:17+05:30 IST

Read more