బాలీవుడ్ బ్యూటీ‌కి మిచిగాన్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక ఫెలోషిప్.. ఎవరికీ ఇస్తారంటే..

ABN , First Publish Date - 2022-04-08T19:37:57+05:30 IST

‘వీరే ది వెడ్డింగ్’ సినిమాతో బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి స్వరా భాస్కర్. వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా

బాలీవుడ్ బ్యూటీ‌కి మిచిగాన్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక ఫెలోషిప్..  ఎవరికీ ఇస్తారంటే..

‘వీరే ది వెడ్డింగ్’ సినిమాతో బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి స్వరా భాస్కర్. వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉన్న ఈ భామ కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. అక్కడ ఆస్కార్‌గాలాతో పాటు బ్రిడ్జర్టన్ 2 సక్సెస్ బాష్‌ కార్యక్రమాలకు కూడా హాజరయ్యింది. దీంతో ఎంతోమంది  స్వరా అభిమానులు ఆమె యూఎస్‌లో ఏం చేస్తుందా అని నెట్టింట ఆరా తీశారు. అయితే.. ఈ భామకి మిచిగాన్ యూనివర్సిటీ నుంచి ప్రతిష్టాత్మక ఫెలోషిప్ లభించిందట. ఈ విషయాన్ని తాజాగా స్వరానే సోషల్ మీడియా వేదికగా తెలిపింది.


కళాకారులు, రచయితలు, ప్రదర్శనకారులుగా సక్సెస్ సాధించిన వారికి మాత్రమే మిచిగాన్ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ సౌత్ ఏషియా స్టడీస్‌లో ప్రతిష్టాత్మక హ్యూస్ ఆర్టిస్ట్-ఇన్-రెసిడెన్స్ ఫెలోషిప్‌ను అందిస్తుంది. దీనికి సంబంధించి ఓ పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసిన స్వరా.. ‘మిచిగాన్ విశ్వవిద్యాలయం, ఆన్ అర్బర్‌లోని హ్యూస్ ఫెలో ఆర్టిస్ట్-ఇన్-రెసిడెన్స్‌‌కి హలో చెప్పండి. సెంటర్ ఫర్ సౌత్ ఏషియా స్టడీస్‌కి ధన్యవాదాలు. స్కూల్‌లో దక్షిణాసియా, ఆఫ్రికాకి సంబంధించి ముఖ్య వక్తల్లో ఒకరి నిలవడానికి ఆతృతగా ఉన్నాను’ అంటూ రాసుకొచ్చింది.


అంతేకాకుండా అమెరికాలోని ఓ మీడియాతో స్వరా మాట్లాడుతూ.. ‘నాకు ఇలాంటి గౌరవం లభినందుకు చాలా ఆనందంగా ఉంది. మిచిగాన్ యూనివర్సిటీలోని వనరులను ఉపయోగించుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడి తరగతి గదిలో జరిగే సంభాషణల్లో పాల్గొనడానికి, వివిధ సంస్కృతుల గురించి తెలుసుకోడానికి ఊవ్విళ్లూరుతున్నాను. ఇది వివిధ విషయాలపై నా అవగాహనను విస్తృతం చేస్తుందని భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది.



Updated Date - 2022-04-08T19:37:57+05:30 IST