ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఫెయిల్యూర్‌లా ఫీల్ అయ్యా : Sunny Leone
ABN, First Publish Date - 2022-01-04T18:18:48+05:30
‘జిస్మ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బ్యూటీ సన్నీ లియోన్. పోర్న్ తారగా మొదలై హిందీ చిత్ర పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు పొందింది...
‘జిస్మ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బ్యూటీ సన్నీ లియోన్. పోర్న్ తారగా మొదలై హిందీ చిత్ర పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు పొందింది. అయితే ఈ భామకి, భర్త డేనియల్ వెబర్‌కి సరోగసీ ద్వారా కవలలు నోవా, అషెర్ కలగగా.. నిషా అనే బాలికని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సరోగసీ ద్వారా పిల్లలను పొందడం గురించి మాట్లాడింది సన్నీ. దాదాపు సంవత్సరన్నర పట్టిన ఆ ప్రాసెస్ సమయంలో తన గుండె బద్దలైపోయిందని చెప్పింది. నిజానికి అంతకుముందే సన్నీ దంపతులిద్దరూ ఎవరినైనా ఎందుకు దత్తత తీసుకోకూడదని ఆలోచించినట్లు తెలిపింది.
సన్నీ మాట్లాడుతూ.. ‘ మేము సరోగసీ ప్రక్రియకి వెళదామని తీసుకుని ముందుకు వెళ్లాం. ఈ ప్రక్రియా దాదాపు ఏడాదిన్నర సమయం పట్టింది. ఆ సమయంలో సరోగసీ సరైన విధంగా సాగకపోవడంతో అరే, మనం ఎందుకు దత్తత తీసుకోకూడదని ఆలోచించాం. మాకు ఆరు అండాలు ఉన్నాయి. అందులో నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు కావాలి. అమెరికాలో లింగ నిర్థారణ పరీక్షలు, జన్యు పరీక్షలు చేయవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. కాబట్టి మేము ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చేశాం. కానీ మేము అనుకున్నట్లు అమ్మాయిలు పుట్టలేదు. దీంతో నిజంగా గుండె పగిలినంత బాధ కలిగింది. అలా ఉంటే ఎవరైనా వైఫల్యం చెందినట్లు భావిస్తారు. చాలా వీక్‌గా ఫీల్ అవుతారు. నాకు అలాగే అనిపించింద’ని చెప్పింది.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘దీంతో పిల్లలు పుట్టక ముందే ఓ బాలికను ఎందుకు దత్తత తీసుకోకూడదు అనుకున్నాం. ఆమె జెనెటికల్లీ కలవకపోవచ్చు కానీ హృదయానికి దగ్గరగా ఉంటుంది కదా అని భావించాం. ముంబైలోని ఓ అనాథాశ్రమంలో ప్రయత్నించాం. అయితే దానికి సంబంధించిన ప్రాసెస్‌కి సమయం తీసుకుంది. అయితే చిత్రంగా సరోగసీ ద్వారా కవలలు, ఈ చిన్న పాప ఒకే వారంలో మా ఇంటికి వచ్చారు. అలా జరగాలని దేవుడి ప్లాన్ అనుకుంటాన’ని తెలిపింది.