నీకు మంచి భార్య దొరకాలని కోరుకుంటున్న: సన్నీ లియోన్

ABN , First Publish Date - 2022-03-17T22:40:30+05:30 IST

పోర్న్ స్టార్‌గా కెరీర్‌ను ప్రారంభించి హీరోయిన్‌గా మారిన

నీకు మంచి భార్య దొరకాలని కోరుకుంటున్న: సన్నీ లియోన్

పోర్న్ స్టార్‌గా కెరీర్‌ను ప్రారంభించి హీరోయిన్‌గా మారిన సుందరి సన్నీ లియోన్. ‘జిస్మ్-2’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘కరెంటు తీగ’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ మధ్యనే ‘అనామిక’ వెబ్ సిరీస్‌లో కనిపించి అందరినీ అలరించింది. తాజాగా సన్నీ లియోన్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..


మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘గాలి నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సన్నీ లియోన్ ఓ కీలక పాత్ర పోషస్తుంది. రేణుక అనే పాత్రలో ఆమె నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం తిరుపతిలో జరిగింది. ఆ సమయంలో ఓ అభిమాని ఈ సినిమా సెట్‌కు వచ్చి సన్నీని కలుసుకున్నాడు. ఆ ఫ్యాన్ సన్నీ పేరును టాటూగా వేయించుకున్నాడు. తన పేరుని పచ్చబొట్టు వేయించుకోవడంతో ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడే ఈ వీడియోని తీసింది. తాజాగా దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘‘నువ్వు ఎప్పుడు నన్ను ప్రేమిస్తూనే ఉంటావని ఆశిస్తున్నాను. ఎందుకంటే నీకు వేరే దారి లేదు. నీకు మంచి భార్య దొరకాలని కోరుకుంటున్నా’’ అని ఇన్‌స్టాలో సన్నీ రాసుకొచ్చింది.  


సన్నీ లియోన్ అసలు పేరు కరణ్‌జిత్ కౌర్ వోహ్రా. సన్నీ 2011లో బిగ్ బాస్-5లో పాల్గొంది. ఈ రియాలిటీ షో చేసినప్పుడు ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అనంతరం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. పూజా భట్ దర్శకత్వం వహించిన ‘జిస్మ్-2’తో బీ టౌన్‌లో కెరీర్ ఆరంభించింది.Updated Date - 2022-03-17T22:40:30+05:30 IST

Read more