సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కండోమ్ టెస్టర్‌గా రకుల్ ప్రీత్ సింగ్.. నటి తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటో తెలుసా..

ABN, First Publish Date - 2022-03-07T18:01:45+05:30

మొదట బాలీవుడ్‌కి నటిగా పరిచయమై.. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి రకుల్ ప్రీత్ సింగ్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొదట బాలీవుడ్‌కి నటిగా పరిచయమై.. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి రకుల్ ప్రీత్ సింగ్. అనంతరం చేసిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సూపర్ హిట్‌‌ సాధించడంతో ఈ బ్యూటీ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. దీంతో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అనంతరం బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి పాపులారిటీనే సాధించింది.


రకుల్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఛత్రివాలి’. అందులో ఈ బ్యూటీ కండోమ్ టెస్టర్‌గా ఢిపరెంట్ పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర గురించి, ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అలాగే తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటో ఈ భామ వివరించింది.


రకుల్ మాట్లాడుతూ.. ‘ఇది కొత్త విషయమేం కాదు. ఎప్పటి నుంచో సమాజంలో ఉన్నదే. అయితే మేం తీయాలనుకుంటున్నది ప్రత్యేకమైన కథ అని మా మూవీ టీంకి తెలుసు. కానీ చాలా తేలికగా అందరికి నచ్చేలా కుంటుంబ కథా చిత్రంగా చూపిస్తున్నాం. ఇది ఒక చిన్న పట్టణం నుంచి వచ్చి కండోమ్ టెస్టర్ క్వాలిటీ హెడ్‌గా మారిన ఓ అమ్మాయి కథ. మొదట డబ్బు కోసమే ఉద్యోగం చేసిన అనంతరం దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుంటుంది. ఎంతో సరదాగా ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేశాం’ అని చెప్పుకొచ్చింది. 


ఇలాంటి చిత్రం ఓ కుటుంబ చిత్రం ఎలా అవుతుందని అడగగా.. ‘మనం ఎలా పుడతామో అందరికీ తెలుసు. అయితే దాని గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడతాం. కానీ దానికి గురించి సిగ్గు పడకుండా తెలుసుకుంటే మంచిదని ఇందులో చూపిస్తున్నాం. యువతరానికి ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలి. వారికి ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలియాలి. అంతేకాకుండా ఇందులో మేం అసభ్యకరంగా చూపించట్లేదు’ అని తెలిపింది.


అలాగే తల్లిదండ్రుల రియాక్షన్ గురించి మాట్లాడుతూ.. ‘నిజానికి ఇలాంటి పాత్రలు చేస్తే కెరీర్ పరంగా కొంచెం ఇబ్బందే. కానీ అది అవసరం కూడా. అందుకే ఈ క్యారెక్టర్‌ని చేయాలనుకున్నాను. ఈ సినిమా పాత్ర గురించి నా తల్లిదండ్రులకు కూడా చెప్పాను. వాళ్లు మరో ఆలోచన లేకుండా నన్ను చేయమని ఎంకరేజ్ చేశారు. నా ప్రతి కథ గురించి వారికి చెప్పి వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే చేస్తాను. ఎందుకంటే వారు ప్రేక్షకుల దృష్టితో చూస్తారు’ అని రకుల్ చెప్పింది.

Updated Date - 2022-03-07T18:01:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!