వామ్మో.. నాకు నాలాంటి కూతురా.. Poonam Pandey ఇంట్రస్టింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2022-05-08T19:07:02+05:30 IST

‘నషా’ సినిమాతో బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపుపొందిన నటి పూనమ్ పాండే. సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ...

వామ్మో.. నాకు నాలాంటి కూతురా.. Poonam Pandey ఇంట్రస్టింగ్ కామెంట్స్

‘నషా’ సినిమాతో బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపుపొందిన నటి పూనమ్ పాండే. సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ బోల్డ్‌గా ఉంటూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ చేసిన ‘లాకప్’ షోలో మరోసారి న్యూస్‌లో నిలిచింది. అయితే.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి శృంగార భరిత చిత్రాలు తీసి, వివాదాల్లో ఇరుక్కోవడం వల్ల పూనమ్‌ తల్లికి దూరం కావాల్సి వచ్చింది. అయితే తాజాగా పూనమ్ పాల్గొన్న ‘లాకప్’ షోకి గెస్ట్‌గా ఆమె తల్లి హాజరైంది. దీంతో వారి మధ్య ఉన్న విభేదాలకు తెరపడినట్లైంది. తాజాగా మదర్స్ డే సందర్భంగా తన తల్లి గురించి పూనమ్ పలు విషయాలను పంచుకుంది.


పూనమ్ మాట్లాడుతూ.. ‘గతంలో నేను చాలా తప్పులు చేశాను. అందువల్ల మా అమ్మ చాలా ఇబ్బంది పడిందని భయపడ్డాను. కానీ ఆమె నా షోకి రావడంతో కొంచెం రిలీఫ్ దొరికింది. నిజానికి ఆమె షోకి రాదని చాలా భయపడ్డాను. నన్ను క్షమించి అక్కడికి వచ్చింది’ అంటూ చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.


పూనమ్ ఇంకా మాట్లాడుతూ.. ‘నాకు నాలాంటి కూతురు ఉండటాన్ని నేను ఊహించుకోలేను. ఎందుకంటే అప్పుడప్పుడు అమ్మ స్థానంలో ఉండి ఆలోచిస్తుంటాను. అలాంటి సందర్భాల్లో నాలాంటి కూతురు ఉంటే నా పరిస్థితి ఏంటని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఆమెలాగా యాక్సెప్ట్ చేయగలనా లేదా అని నా అనుమానం. ఆమె గురించి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ.. ఆమె పూనమ్ పాండే తల్లి అని మాత్రం గర్వంగా చెప్పగలను’ అని తెలిపింది.

Updated Date - 2022-05-08T19:07:02+05:30 IST

Read more