‘నువ్వు సినిమాల్లో నటిస్తే పెళ్లి చేసుకోనన్నాడు.. అందుకే అంత మంచి సినిమాను రిజెక్ట్ చేశా..’

ABN , First Publish Date - 2022-05-08T00:12:08+05:30 IST

బాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్‌గా నిలిచిన సినిమా ‘ఆషికీ’ (Aashiqui). ఈ చిత్రంలోని రొమాంటిక్ గీతాలన్ని బాగా పాపులర్ అయ్యాయి. శ్రోతల మదిని దోచాయి.

‘నువ్వు సినిమాల్లో నటిస్తే పెళ్లి చేసుకోనన్నాడు.. అందుకే అంత మంచి సినిమాను రిజెక్ట్ చేశా..’

బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్‌గా నిలిచిన సినిమా ‘ఆషికీ’ (Aashiqui). ఈ చిత్రంలోని రొమాంటిక్ గీతాలన్ని బాగా పాపులర్ అయ్యాయి. శ్రోతల మదిని దోచాయి. ఇప్పటికీ కూడా కొంత మంది ఆ సాంగ్స్‌ను అలపిస్తుంటారు. ఈ మూవీలో అను అగర్వాల్ (Anu Agarwal)హీరోయిన్‌గా నటించింది. కానీ, ఆ పాత్ర కోసం తొలుత పూజా భట్‌ (Pooja Bhatt) ను సంప్రదించారు. ఆ చిత్రాన్ని అప్పట్లో ఆమె ఒప్పుకోలేదు. అందుకు గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 


‘ఆషికీ’ మూవీ ఆఫర్ మొదట పూజా భట్‌కే వచ్చింది. కానీ, తాను సినిమాలు చేయడం పూజ బాయ్ ఫ్రెండ్‌కు ఇష్టం లేదు. ఫలితంగా ఆ చిత్రాన్ని నిరాకరించింది. ‘‘నాకు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. 12 ఏళ్లప్పటి నుంచే అతణ్ని ప్రేమిస్తున్నాను. 16ఏళ్లకే అతడితో డేటింగ్ చేయడం ప్రారంభించాను. నాకు 17 ఏళ్లున్నప్పుడు ‘డాడీ’ (Daddy) సినిమాలో నటించాను. మరుసటి ఏడాది ‘దిల్ హై కీ మంత నహీ’ (Dil Hai Ki Manta Nahin) చిత్రం చేయమని నన్ను అడిగారు. నేను ఫస్ట్ మూవీలో నటించినప్పుడు నా బాయ్ ఫ్రెండ్ ఓపికగానే ఉన్నాడు. నేను సినిమాలు చేయడం అతడికీ ఇష్టం లేదు. వివాహం చేసుకోవాలంటే చిత్రాల్లో నటించకూడదని చెప్పాడు. ప్రేమ కోసం ఏదైనా చేస్తానని నేను పేర్కొన్నాను. అప్పుడే ముకేశ్ భట్ (Mukesh Bhatt) మా ఇంటికీ వచ్చాడు. రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు.  నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. నా తండ్రి కూడా నచ్చ చెప్పాడానికీ ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ సినిమాను నేను అంగీకరించలేదు’’ అని పూజా భట్ చెప్పుకొచ్చింది. కొన్నాళ్లకు పూజా భట్‌కు తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అయింది. అనంతరం వారిద్దరూ స్నేహితులుగా కొనసాగడం ప్రారంభించారు. కానీ, ఒకసారి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ‘ఆషికీ’ సినిమా చేసుంటే బాగుండేదనిపిస్తుందని ఆమె వెల్లడించింది.

Updated Date - 2022-05-08T00:12:08+05:30 IST

Read more