ఆటో డ్రైవర్స్‌తో కలిసి హాట్‌బ్యూటీ డ్యాన్స్.. వీడియో వైరల్
ABN , First Publish Date - 2022-01-13T16:11:24+05:30 IST
డేటా రేటు తగ్గి ఇంటర్నెట్ అందరికి అందుబాటులోకి వచ్చింది. దాంతో ఓటీటీలు, యూట్యూబ్‌తో కూడా ఆదాయాన్ని అర్జిస్తున్నారు చాలామంది...
డేటా రేటు తగ్గి ఇంటర్నెట్ అందరికి అందుబాటులోకి వచ్చింది. దాంతో ఓటీటీలు, యూట్యూబ్‌తో కూడా ఆదాయాన్ని అర్జిస్తున్నారు చాలామంది. కాబట్టి ఇటీవలనార్మల్ సినిమాలకే కాకుండా డిజిటల్‌గా విడుదలయ్యే షోలు, సాంగ్స్‌కి కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ నియా శర్మ నటించిన ఓ సాంగ్ యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ పాట రిలీజై రెండు రోజులు కూడా కాకముందే 4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అయితే దీని ప్రమోషన్స్‌లో భాగంగా సల్మాన్ హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్‌బాస్’కి వెళ్లింది ఈ భామ.
తాజాగా ముంబైలోని ఆటో రిక్షా డ్రైవర్స్‌తో కలిసి తన సాంగ్‌కి డ్యాన్స్ వేసింది ఈ తార. దీని సంబంధించిన వీడియో సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. అందులో కొందరు బావుంది అంటూ పాజిటివ్ రియాక్ట్ అవుతుండగా.. కొందరు కామెడీగా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు.