నెటిజన్లను గతంలోకి తీసుకెళ్లిన కరిష్మా కపూర్
ABN , First Publish Date - 2022-03-28T00:57:45+05:30 IST
రణధీర్ కపూర్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ

రణధీర్ కపూర్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కరిష్మా కపూర్. చిన్న వయసులోనే హీరోయిన్‌గా వెండితెర పైకి రంగప్రవేశం చేసింది. అనంతరం ‘రాజా హిందూస్థానీ’, ‘దిల్ తో పాగల్ హై’, ‘జుడ్వా’, ‘సుహాగ్’ వంటి చిత్రాల్లో నటించి అభిమానులను అలరించింది. తాజాగా ఈ హీరోయిన్ మనల్ని గతంలోకి తీసుకెళ్లింది.
బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్ గతాన్ని గుర్తుకు తెచ్చింది. 90వ దశకంలో ఎంతో పాపులర్ అయిన ‘నిర్మా’ డిటర్జెంట్ యాడ్‌ను ఆమె రీక్రియేట్ చేసింది. అప్పట్లో ‘నిర్మా’యాడ్‌లో దీపికా చిక్లియా నటించింది. దీపిక మేనరిజమ్స్‌ను అచ్చం అలాగే కరిష్మా అనుకరించింది. కరిష్మా నటనకు నెటిజన్లందరూ ఫిదా అయ్యారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తడం మొదలుపెట్టారు. ‘‘ఎవర్ గ్రీన్’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘అద్భుతంగా ఉంది’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ స్పందించాడు. ‘‘నేను మీ నటనను చూసి ఆశ్చర్యానికి గురయ్యాను’’ అని ఒకరు కామెంట్ పోస్ట్ చేశారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. కరిష్మా 2020లో ‘మెంటల్ హుడ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ షోలో మాజీ అందాల సుందరిగా, తన ముగ్గురు పిల్లలను గ్లామార్ రంగంలోకి తీసుకురావాలని కంకణం కట్టుకున్న తల్లిగా కనిపించింది. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘లాల్ సింగ్ చద్దా’లో అతిథి పాత్రలో కరిష్మా మెరవనుంది.