ప్రేక్షకులు లేకపోవడంతో Kangana Ranaut సినిమా షోస్ క్యాన్సిల్

ABN , First Publish Date - 2022-05-23T00:51:01+05:30 IST

సమకాలీన అంశాలపై తరచు స్పందించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). ‘క్వీన్’, ‘మణికర్ణిక’ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ ఓరియేంటేడ్ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కంగన

ప్రేక్షకులు లేకపోవడంతో Kangana Ranaut సినిమా షోస్ క్యాన్సిల్

సమకాలీన అంశాలపై తరచు స్పందించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). ‘క్వీన్’, ‘మణికర్ణిక’ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ ఓరియేంటేడ్ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కంగన తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్’(Dhaakad). స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. థియేటర్స్‌లో మే 20న విడుదలైంది. ఈ మూవీ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అభిమానులను మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ‘ధాకడ్’తో పాటు కార్తిక్ ఆర్యన్(Kartik Aaryan) హీరోగా నటించిన ‘భూల్ భూలయ్యా-2’(Bhool Bhulaiyaa 2) అదే రోజు విడుదలైంది. ఈ కామిక్ థ్రిల్లర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీంతో సినిమా చూడాలనుకునేవారికీ మొదటి ఛాయిస్‌గా నిలుస్తుంది. ‘ధాకడ్’ సినిమా తొలిరోజు రూ. 50లక్షలను మాత్రమే వసూలు చేసింది. ఆ తర్వాతి రోజు నుంచి కలెక్షన్లు మరింత తగ్గాయి. ఈ క్రమంలో ‘ధాకడ్’కు కేటాయించిన షోలన్నింటిని క్యాన్సిల్ చేసి ‘భూల్ భూలయ్యా-2’ తో రీప్లేస్ చేస్తున్నారు.    


కంగన హీరోయిన్‌గా నటించిన ‘ధాకడ్’ ను దాదాపుగా 2100 స్క్రీన్స్‌లో విడుదల చేశారు. మే 22 నాటికి 250 నుంచి 300 స్ర్కీన్స్‌లో చిత్రాన్ని తొలగించారు. మే 23 నుంచి ఈ స్క్రీన్స్ మరింత తగ్గే అవకాశం ఉంది. ‘‘...‘ధాకడ్’ ను చూడాలనే ఆసక్తి ప్రేక్షకులకు ఏ మాత్రం లేదు. మొదటి రోజు కూడా చాలా కొద్దిమంది మాత్రమే వీక్షించారు. ప్రేక్షకులు లేకపోవడంతో అనేక షోస్‌ను క్యాన్సిల్ చేశారు. ‘భూల్ భూలయ్యా-2’కు టాక్ బాగుంది. ఈ చిత్రాన్ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీకీ కలెక్షన్లు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. కంగన సినిమాకు చాలా తక్కువ సింగిల్ స్క్రీన్స్ లభించాయి. థియేటర్‌కు 10 నుంచి 15 మంది ప్రేక్షకులు మాత్రమే వస్తున్నారు. అందువల్ల ఈ మూవీని తొలగిస్తున్నారు. మల్లీప్లెక్స్‌లు కూడా ‘ధాకడ్’ కు షోలు తగ్గిస్తున్నాయి. కార్తిక్ ఆర్యన్ సినిమాకు మంచి డిమాండ్ ఉండటంతో దానినే ప్రదర్శిస్తున్నారు’’ అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2022-05-23T00:51:01+05:30 IST

Read more