సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వాలని కోర్టును అభ్యర్థించిన Jacqueline Fernandez

ABN, First Publish Date - 2022-05-11T22:02:02+05:30

ఆర్థిక మోసం కేసులో సుకేశ్ చంద్రశేఖర్‌‌‌ను (Sukesh Chandrasekhar) ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగానే బాలీవుడ్ నటి, శ్రీంలక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను ఎదుర్కొంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్థిక మోసం కేసులో సుకేశ్ చంద్రశేఖర్‌‌‌ను (Sukesh Chandrasekhar) ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగానే బాలీవుడ్ నటి, శ్రీంలక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను ఎదుర్కొంటుంది. కొన్ని రోజుల క్రితం జాక్వెలిన్‌కు చెందిన రూ.7.27కోట్ల విలువైన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఆమె పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని దేశం విడిచి వెళ్లకుండా  నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో.. విదేశాలకు వెళ్లేందుకు 15రోజుల పాటు అనుమతి ఇవ్వాలని ఈ అందాల భామ కోరింది. కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.    


ఈ పిల్ మార్చి 18న విచారణకు రానుంది. ఆమె పిటిషన్‌పై ఈడీ స్పందించాల్సిందిగా ఆడిషనల్ సెషన్స్ జడ్జీ ప్రవీణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరఫున అడ్వకేట్ అర్జిత్ సింగ్ ఈ పిటిషన్ కోర్టుకు సమర్పించారు. ‘‘ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో జాక్వెలిన్‌ను నేరస్థురాలని ఎక్కడ పేర్కొనలేదు. ఆమె శ్రీలంకకు చెందినప్పటికీ , 2009నుంచి ఇండియాలోనే నివసిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. ఈడీ విచారణకు ఎల్లప్పుడు సహకరించింది. ఎటువంటి కారణం లేకుండా ఈడీ ఆమె పాస్‌పోర్టును సీజ్ చేసింది. అందువల్ల ఆమె విదేశాలకు ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలి’’ అని  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆ పిటిషన్‌లో పేర్కొంది. 

Updated Date - 2022-05-11T22:02:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!