కూతురికి పాలిస్తున్న ఫొటో షేర్ చేసిన నటి.. అభిమానుల రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-17T16:49:42+05:30 IST

బాలీవుడ్‌లోని బోల్డ్ బ్యూటీ‌లలో ఎవాలీన్ శర్మ ఒకరు. ఏ విషయం మీదైనా ఎటువంటి బెరుకు లేకుండా మాట్లాడుతూ..

కూతురికి పాలిస్తున్న ఫొటో షేర్ చేసిన నటి.. అభిమానుల రియాక్షన్ ఏంటంటే..

బాలీవుడ్‌లోని బోల్డ్ బ్యూటీ‌లలో ఎవాలీన్ శర్మ ఒకరు. ఏ విషయం మీదైనా ఎటువంటి బెరుకు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు పాలు ఇవ్వడం, దాని గురించి మాట్లాడడం అసభ్యంగా చూడకూడదంటూ ఈ బ్యూటీ ప్రచారం చేస్తుంటుంది. దానికి సపోర్టుగా తన కూతురికి పాలిస్తున్న పిక్‌ని ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసింది.


ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ పిక్‌కి.. ‘ప్రతి రోజూ.. రోజంతా ఇలాగే’ అంటూ క్యాప్షన్ సైతం రాసుకొచ్చింది. పిల్లలకు పాలివ్వడం గురించి ఈ భామ మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో సైతం ఇలాంటి పిక్‌నే పోస్ట్ చేసింది. అంతేకాకుండా సందర్భం వచ్చినప్పుడల్లా ‘అందులో మాతృత్వపు మాధుర్యాన్ని చూడండి.. అంతేకానీ అశ్లీలాన్ని కాదు’ అని చెబుతూ ఉంటుంది.


ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఎంతో మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎవాలీన్ పోస్ట్‌కి ఫిదా అయిన ఓ నెటిజన్ అయితే.. ‘ప్రపంచంలోనే అత్యంత అందమైనది ఇదే. పాప చాలా ముద్దుగా ఉంది. రాబోయే కొత్త తరానికి మీరే రోల్ మోడల్. ఇలాగే ఉండండి’ అంటూ కామెంట్ చేశారు. అలాగే మరికొందరు ఈ భామకి సపోర్టు చేస్తూ కామెంట్స్ చేశారు. కాగా.. మరొవైపు కొందరు నెగటివ్ కామెంట్స్ సైతం చేస్తున్నారు.


గత కొన్ని రోజుల క్రితం ఎవాలీన్ చేసిన పోస్ట్‌లో.. ‘నేను తల్లిపాలు ఇస్తున్న ఫోటోలను ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. అదే నా ప్రస్తుత ఉద్యోగం. దీని కోసం ఎన్నో అదనపు గంటలు పని చేశా, ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. నా బిడ్డ ఆరోగ్యంగా ఏదగడమే.. ఈ కష్టానికి నాకు అందే జీతం. అదే తల్లిగా ఎవరైనా కోరుకునేది’ అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.Updated Date - 2022-03-17T16:49:42+05:30 IST

Read more