సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నేను ఏడో తరగతిలో చేసిన ఆ పని అదే మొదటిది, చివరిది: దీపికా పదుకొణె

ABN, First Publish Date - 2022-04-10T21:14:40+05:30

విభిన్నమైన పాత్రలను అలవోకగా పోషించే నటి దీపికా పదుకొణె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభిన్నమైన పాత్రలను అలవోకగా పోషించే నటి దీపికా పదుకొణె. బాలీవుడ్, హాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీల్లోనూ దీపిక సినిమాలు చేస్తుంది. తనలో దాగి ఉన్న కళను ఆమె తొలిసారిగా బయటపెట్టింది. ఆ నైపుణ్యాన్ని అభిమానులకు చూపెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీపికలో దాగి ఉన్న కళ ఏంటో మీకు తెలుసుకోవాలనుందా..

 

దీపికా పదుకొణె ఏడో తరగతి చదువుతన్నప్పుడు, టీచర్స్ ఓ కవితను రాయమన్నారు. ‘ఐ యామ్’ అనే రెండు పదాలు ఇచ్చారు. దీపిక ఆ రెండు పదాలనే టైటిల్‌గా పెట్టింది. 12ఏళ్ల వయసులోనే మూడు పేరాల కవితను రాసింది. ఆ విధంగా రాయడం మొదటి, చిట్ట చివరి ప్రయత్నమంటూ ఆమె పేర్కొంది. తాజాగా ఆ కవితను ఫొటో తీసి దీపిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘‘టీచర్స్ నాకు ‘ఐ యామ్’ అనే రెండు పదాలు ఇచ్చారు. నేను ఆ పదాలనే టైటిల్‌గా పెడుతూ కవితను రాశాను. అలా కవితను రాయడం నేను చేసిన మొదటి, చిట్ట చివరి ప్రయత్నం’’ అని దీపిక పదుకొణె చెప్పింది. దీపిక తండ్రి ప్రకాశ్ పదుకొణె బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడచి జాతీయ స్థాయి ప్లేయర్‌గా ఎదిగింది. కానీ, 16ఏళ్ల వయసులో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. అనంతరం నటిగా మారి ముంబైలో స్థిరపడింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. దీపిక ప్రస్తుతం ‘పఠాన్’, ‘ఫైటర్’ చిత్రాల్లో నటిస్తుంది.


Updated Date - 2022-04-10T21:14:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!