సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Deepika Padukone: ఆకర్షణ కోసం మాత్రమే ఈ సినిమాలో అలాంటి సీన్స్ పెట్టలేదు

ABN, First Publish Date - 2022-02-15T18:12:28+05:30

బాలీవుడ్‌లో హీరోయిన్ దీపిక పదుకొనేకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అందుకే ఈ బ్యూటీ సినిమా వస్తుందంటే భారీ హైప్ క్రియేట్ అవుతూ ఉంటుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో హీరోయిన్ దీపిక పదుకొనేకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అందుకే ఈ బ్యూటీ సినిమా వస్తుందంటే భారీ హైప్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ భామ తాజాగా నటించిన చిత్రం ‘గెహ్రాయాన్’పై కూడా అలాంటి హైపే క్రియేట్ అయ్యింది. శకున్ బాత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.


అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో దీపిక రొమాన్స్‌లో రెచ్చిపోయింది. దీంతో కొందరూ సినీ ప్రముఖులతో పాటు ఈ భామ ఫ్యాన్స్‌ కూడా విమర్శలు చేశారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌ కంగన రనౌత్ అయితే ఈ సినిమాని పోర్న్ సినిమాతో పొల్చింది. తాజాగా దీపిక ఈ విమర్శలపై స్పందించింది.


దీపిక మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో కొంచెం రొమాన్స్ ఉండడం నిజమే. అది ఈ మూవీలోని పాత్రల మధ్య బంధాలు, వారి ప్రయాణం, సాన్నిహిత్యం నిజమని నమ్మడానికి అది ఉపయోగపడింది. అంతేకానీ, ఈ సినిమాని చూసేలా ప్రేక్షకులని ఆకర్షించడానికి కాదు. కానీ ఈ సినిమా కథ భాగంగానే అది చేయాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చింది.


దీపిక ఇంకా మాట్లాడుతూ.. ‘సిద్ధాంత్ చతుర్వేది, నసీరుద్దీన్ షా, రజత్ కపూర్‌‌తో చేసిన కొన్ని సన్నివేశాల చేశాను. అవి నటిగా నాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయి. ఇలాంటి నటుల ముందు నా టాలెంట్‌ని చూపించడం చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ డైరెక్టర్ శకున్ బత్రాతో కలిసి పని చేయడం మంచి ఎక్స్‌పిరీయన్స్ ఇచ్చింది. ఆయన నుంచి ఎన్నో మంచి విషయాలను నేర్చుకున్నాను’ అని తెలిపింది.

Updated Date - 2022-02-15T18:12:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!