‘ఆర్‌ఆర్‌ఆర్’ పోస్టుల డిలీట్‌పై స్పష్టతనిచ్చిన అలియా.. ఊహాగానాలను ప్రచారం చేయొద్దంటూ ఇన్‌స్టా‌లో పోస్ట్..

ABN , First Publish Date - 2022-03-31T23:47:00+05:30 IST

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమా ‘‘రౌద్రం, రణం, రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్)

‘ఆర్‌ఆర్‌ఆర్’ పోస్టుల డిలీట్‌పై స్పష్టతనిచ్చిన అలియా.. ఊహాగానాలను ప్రచారం చేయొద్దంటూ ఇన్‌స్టా‌లో పోస్ట్..

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమా ‘‘రౌద్రం, రణం, రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్)’’. దర్శక ధీరుడు ఎస్‌ఎస్.రాజమౌళి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటించారు. రాజమౌళిపై అలియా భట్ అగ్రహాంగా ఉందని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.


తన పాత్రను రాజమౌళి ఎడిటింగ్‌లో కత్తిరించడంతో అలియా భట్ అసంతృప్తికి లోనయ్యిందని కథనాలు వెలువడ్డాయి. తాజాగా  ఈ వార్తలపై అలియా భట్ స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. తాను ‘ఆర్‌ఆర్‌ఆర్‘ బృందంపై అసంతృప్తితో లేనని ఆమె చెప్పింది. అటువంటి ఊహాగానాలను ప్రచారం చేయొద్దని కోరింది. ‘‘చిత్రబృందంపై నేను అసంతృప్తితో ఉన్నానని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకే ‘ఆర్‌ఆర్‌ఆర్’ పోస్టులను డిలీట్ చేశానని ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారు. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోని పోస్టులను తక్కువ చిందరవందరంగా ఉంచేందుకు నేను ఇష్టపడతాను. అందుకే పాత వీడియో పోస్టులన్నింటిని తిరిగి అమర్చుతుంటాను’’ అని అలియా చెప్పింది. 


‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో భాగం అయినందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని అలియా భట్ తెలిపింది. ‘‘సీత పాత్ర నాకెంతో నచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో నటించడం అద్భుతంగా ఉంది. తారక్, చరణ్ లతో పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సంబంధించి ప్రతి చిన్న విషయం నాకెంతో నచ్చింది. రాజమౌళి, చిత్రబృందం ఎన్నో ఏళ్లు కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించిన అసత్యాలను ప్రచారం చేయడానికి నేను నిరాకరిస్తున్నాను’’ అని అలియా పోస్ట్ పెట్టింది.

Updated Date - 2022-03-31T23:47:00+05:30 IST