Aishwarya Rai: ఐశ్వర్యా మళ్లీ తల్లి కాబోతోందా?.. ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..

ABN , First Publish Date - 2022-09-24T15:59:23+05:30 IST

సౌత్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai)...

Aishwarya Rai: ఐశ్వర్యా మళ్లీ తల్లి కాబోతోందా?.. ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..

సౌత్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai). కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌(Abhishek Bachchan)ని పెళ్లి చేసుకుని.. బచ్చన్ ఫ్యామిలీకి కోడలిగా మారిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దాదాపు దూరమైపోయిన.. కూతురు ఆరాధ్య పుట్టిన తర్వాత సినిమాలకి పూర్తిగా జరిగింది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యాకి సరైన సినిమా పడలేదు.


ఈ తరుణంలో ఈ బ్యూటీ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. రెండు భాగాలుగా రానున్న ఆ మూవీలో ఓ ముఖ్యమైన పాత్రని ఐశ్వర్య చేస్తోంది. మొదటి భాగం త్వరలో విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో మూవీ టీం బిజీగా ఉంది. ఈ తరుణంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఐశ్వర్య మీడియా కంటపడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. వైట్ ఓవర్ కోట్ వేసుకుని ఉంది. అది చూసిన పలువురు నెటిజన్లు ఐశ్వర్యా గర్భవతి కావొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందులో.. ‘ఆమె గర్భవతి(pregnant)లా కనిపిస్తోంది.. త్వరలో శుభవార్త చెప్పొచ్చు’ అని కొందరూ.. ‘బేబీ 2 రాబోతోంది’ మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఇంతకుముందు కూడా ఐశ్వర్య గర్భవతి అనే ప్రచారం జరిగింది. కానీ అవి రూమర్స్‌గానే మిగిలిపోయాయి.



Updated Date - 2022-09-24T15:59:23+05:30 IST