సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అవార్డు ఫంక్షన్‌లో బోల్డ్‌ బ్యూటీతో స్టార్ హీరో డ్యాన్స్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

ABN, First Publish Date - 2022-03-07T21:17:12+05:30

బాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో రణ్‌వీర్‌ సింగ్ ఒకరు. డ్రెస్సింగ్ దగ్గర నుంచి ప్రవర్తన వరకూ ఈ నటుడు ఏం చేసిన ఎంతో ఢిపరెంట్‌గా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో రణ్‌వీర్‌ సింగ్ ఒకరు. డ్రెస్సింగ్ దగ్గర నుంచి ప్రవర్తన వరకూ ఈ నటుడు ఏం చేసిన ఎంతో ఢిపరెంట్‌గా ఉంటుంది. దాని కారణంగా కొన్నిసార్లు ప్రశంసలు పొందితే.. మరికొన్నిసార్లు విమర్శల పాలవుతుంటాడు. తాజాగా ఈ స్టార్ హీరో అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. 


ఏటా జరిగినట్లుగానే ఐటీఏ అవార్డ్స్ 2022 ఉత్సవం ఫిబ్రవరి 6న ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. అందులో రణ్‌వీర్ సింగ్ కూడా ఉన్నాడు. అయితే ఈ నటుడు బీ టౌన్‌లో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రాఖీ సావంత్‌తో కలిసి రెడ్ కార్పెట్‌పై డ్యాన్స్ వేశాడు. అంతేకాకుండా ఫొటోగ్రాఫర్స్ కోసం ఢిపరెంట్‌గా ఫోజులు సైతం ఇచ్చాడు. ఈ వీడియోని ఓ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్లు వారిద్దరిపై విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వైరల్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..



Updated Date - 2022-03-07T21:17:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!