సైకిల్‌పై ఇంటికి వెళ్లిన యంగ్ హీరో.. వైరల్ వీడియోకి ఫ్యాన్స్ ఫిదా

ABN , First Publish Date - 2022-01-20T19:08:16+05:30 IST

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో కార్తీక్ ఆర్యన్ ఒకరు...

సైకిల్‌పై ఇంటికి వెళ్లిన యంగ్ హీరో.. వైరల్ వీడియోకి ఫ్యాన్స్ ఫిదా

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో కార్తీక్ ఆర్యన్ ఒకరు. ఆయన నటనకే కాకుండా సింప్లీసిటీకి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన గురించి ఏ అప్‌డేట్ వచ్చిన వైరల్ చేసేస్తుంటారు.


తాజాగా కార్తీక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో ఫుట్‌బాల్ గేమ్ అయిపోయిన తర్వాత.. ఈ యువ నటుడు సైకిల్ తొక్కుకుంటూ ఎంతో బిజీగా ముంబై రోడ్డు మీద ఇంటికి వెళ్తున్నాడు. దీనిపై ఎంతోమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.


‘బిల్డప్ లేదు, ఇగో లేదు, ఎలాంటి అహంకారం లేకుండా సైకిల్ మీద వెళుతున్నాడు’ అంటూ కొందరూ నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. సల్మాన్ ఖాన్‌ని ఫాలో అవుతున్నాడంటూ కొందరూ నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు సల్లుభాయ్ ఇలాగే సైకిల్ మీద ముంబై వీధుల్లో తిరిగేవాడు.Updated Date - 2022-01-20T19:08:16+05:30 IST