సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాలీవుడ్ టు బరాబంకీ.. ఎన్నికల్లో తండ్రికి ప్రచారం చేస్తున్న హీరో..

ABN, First Publish Date - 2022-02-21T21:59:51+05:30

ఉత్తర్ ప్రదేశ్‌లో త్వరలోనే నాలుగో దశ ఎన్నికలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తర్ ప్రదేశ్‌లో త్వరలోనే నాలుగో దశ ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ నాయకులందరూ ఓట్ల కోసం ప్రతి ఇంటి గడప తొక్కుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన ఫైజన్ కిద్వాయ్ ఈ ఎన్నికల్లో తన తండ్రి తరఫున ప్రచారం చేస్తున్నారు. పైజన్ బాలీవుడ్‌తో పాటు టెలివిజన్‌లోను పనిచేశారు. 


ఫైజన్ కిద్వాయ్ తండ్రి ఫరీద్ మహఫుజ్ కిద్వాయ్ ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సమాజ్ వాదీ(ఎస్పీ) పార్టీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రామ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. చిట్ట చివరి పల్లెలకు వెళ్లి తన తండ్రి ఒట్లు అడగలేరు కాబట్టి పైజన్ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నా తండ్రి ఇప్పటికే  ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పోటీ చేసిన ప్రతిసారి నేను ప్రచారం నిర్వహించాను. ఈ సారి కూడా మా నాన్న ఎమ్మెల్యేగా గెలవాలని నేను కోరుకుంటున్నాను. అందుకోసమే ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రజల మద్దతు కూడా మాకు ఉంది. మా డాడీ చాలా మంచి వ్యక్తి. ఎటువంటి క్రిమినల్ కేసులు ఆయనపై లేవు. ప్రజలు కూడా అటువంటి వ్యక్తులే రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు’’ అని ఫైజన్ చెప్పారు.

Updated Date - 2022-02-21T21:59:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!