సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Akshay Kumarకి రెండోసారి కరోనా పాజిటివ్.. ఛాన్స్ మిస్సవ్వడం బాధగా ఉందంటూ..

ABN, First Publish Date - 2022-05-15T15:23:23+05:30

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఉన్న ఫ్యాన్ ‌ఫాలోయింగ్ తెలిసిందే. ఈ నటుడు ఏటా రెండు, మూడు సినిమాలతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఉన్న ఫ్యాన్ ‌ఫాలోయింగ్ తెలిసిందే. ఈ నటుడు ఏటా రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తూ ఉంటాడు. ఆయన స్టార్ డమ్ ప్రముఖ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అయిన Cannes Film Festival 2022లో భారత దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం ఇచ్చింది. మరికొద్దిరోజుల్లో అక్కడికి వెళ్లాల్సి ఉన్న ఈ తరుణంలో అక్షయ్‌కి కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. అది కూడా రెండోసారి. గతంలోనూ ఈ స్టార్‌కి కోవిడ్ సోకింది. దీంతో ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్‌‌కి హాజరయ్యే ఛాన్స్ మిస్సవుతూ ట్వీట్ చేశాడు.


అక్షయ్ చేసిన ట్వీట్‌లో.. ‘Cannes 2022లో భారతీయ సినిమాకి ప్రాతినిథ్యం వహించడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. కానీ.. అనుకోకుండా కోవిడ్‌ పాజిటివ్ వచ్చింది. దాంతో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. అనురాగ్ ఠాకూర్‌కి, ఆయన బృందానికి శుభాకాంక్షలు. ఇలాంటి మంచి ఛాన్స్‌ని మిస్సవుతున్నందుకు బాధగా ఉంది’ అంటూ రాసుకొచ్చాడు.



Updated Date - 2022-05-15T15:23:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!