ఆ సమయంలో జోకర్లా చేయవద్దంటూ అర్పితా హెచ్చరించింది: సల్మాన్ చెల్లెలి భర్త
ABN , First Publish Date - 2022-01-14T16:06:29+05:30 IST
ఇటీవలే సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘అంతిమ్’ సినిమాతో మంచి పాపులారిటీ సాధించిన నటుడు ఆయుష్ శర్మ...
ఇటీవలే సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘అంతిమ్’ సినిమాతో మంచి పాపులారిటీ సాధించిన నటుడు ఆయుష్ శర్మ. ఈ యువ నటుడికి, సల్లు భాయ్ చెల్లెలి అర్పితా ఖాన్‌కి 2014లో హైదరాబాద్ ఫలక్నామా ప్యాలెస్‌లో జరిగింది. అ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ఆయుష్.
ఆయుష్ మాట్లాడుతూ.. ‘నాకు బాగా గుర్తుంది. మేము పెళ్లి చేసుకునే సమయంలో నాకసలు డ్యాన్స్ సరిగా రాదు. అర్పితాని కలిసే సమయంలో నేను భయంకరమైన డ్యాన్సర్‌ని. అందుకే ట్రైనింగ్ తీసుకున్నా. కానీ నా గురించి తనకి ముందే తెలుసు. దీంతో స్టేజ్ మీద ఎలా పడితే అలా చేసి జోకర్లా మిగిలిపోవద్దని నన్ను హెచ్చరించింద’ని చెప్పాడు.
అయితే సంగీత్ అనంతరం అందరూ నన్ను మంచి డ్యాన్సర్ అని పొగిడారు. ఇది విని ‘ఓ మై గాడ్ దీని కోసం నువ్వు ఆ స్టూడియోలో ఎన్ని గంటలు కష్టపడ్డావో కదా’ అని అర్పితా అంటూ ఉంటుందని తెలిపాడు.
అయితే సల్మాన్ కొత్త సినిమా ‘కబీ ఈద్ కబీ దివాళి’ సినిమాలో సపోర్టు రోల్ చేయాల్సి ఉంది. అయితే అంతిమ్ మంచి హిట్ సాధించడంతో ప్రధాన పాత్రల్లోనే నటించాలనే ఉద్ధేశంతో దాని నుంచి తప్పుకున్నడంటా.